📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పొదిలి పట్టణంను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తాం

పొదిలి పట్టణంను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తాం

📰 Generate e-Paper Clip

పొదిలి పట్టణంను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తాం – మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి మార్కాపురం సెప్టెంబర్ 30.

ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి పొదిలి పట్టణంలోని 5 మరియు 6వ వార్డుల్లో రెండు రోడ్లకు శంకుస్థాపన చేశారు.
ఈ నిధులు HAM పథకం కింద మంజూరైన 20 కోట్ల రూపాయలతో గత మూడు రోజుల నుండి పొదిలి పట్టణంలోని పలు సిసి రోడ్లకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం పొదిలి పట్టణంలో కనీసం ఒక్క సీసీ రోడ్డు వేసిన పాపాన పోలేదని వార్డుల్లో కనీస వసతులైన రోడ్లు డ్రైన్లను గాలికి వదిలేసారని కానీ ఇప్పటి మా ప్రభుత్వం ప్రజల పట్ల చిత్తశుద్ధితో ఇటీవల మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు పొదిలి పట్టడానికి 20 కోట్ల రూపాయల నిధులు సీసీ రోడ్లకు మంజూరు చేశారని వారికి పొదిలి పట్టణ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
పొదిలి పట్టణానికి 165 కోట్ల రూపాయలతో ఇంటింటికి పైపులైన్ స్కీం ద్వారా ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి త్రాగునీరు అందించి నీటి సమస్యను అధిగమిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు, ఆయా వార్డు తెలుగుదేశం నాయకులు, వార్డు ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.