📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonగ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి - అక్టోబర్ 2న నిరసనలు జయప్రదం చేయండి

గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి – అక్టోబర్ 2న నిరసనలు జయప్రదం చేయండి

📰 Generate e-Paper Clip

*గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి – అక్టోబర్ 2న నిరసనలు జయప్రదం చేయండి*

*వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సింగారపు రమేష్ పిలుపు*

జనగామ, అక్టోబర్ 01 (ప్రజావాణి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సింగారపు రమేష్ డిమాండ్ చేశారు.

బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు చిట్యాల సోమన్న అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన VB-G RAM G (వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్) చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వామపక్షాల పోరాటాల ఫలితంగా యూపీఏ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 100 రోజుల పనిని గ్యారెంటీ చేస్తూ తెచ్చిన చట్టాన్ని, మోదీ ప్రభుత్వం కుట్రపూరితంగా రద్దు చేసిందని విమర్శించారు.
కొత్త చట్టంలో 125 రోజులు పని దినాలు పెంచినట్లు చెప్పినా, నిధుల కేటాయింపులో భారీ కోత విధించిందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే 90% నిధుల వాటాను 60% కి కుదించి, రాష్ట్రాలపై 40% భారం మోపడం పేదలకు పని కల్పించే బాధ్యత నుండి తప్పుకోవడమేనని అన్నారు.
పారదర్శకత పేరుతో రెండుసార్లు ఫోటోలు ఆన్ లైన్ లో అప్ లోడ్ అయితేనే వేతనాలు ఇస్తామనడం ఆందోళన కలిగిస్తుందన్నారు.

*డిమాండ్లు:*

– ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా పునరుద్ధరించాలి.
– పని దినాలు 200 రోజులకు పెంచాలి.
– రోజువారీ కూలీ రూ. 800 ఇవ్వాలి.
– కరువు మండలాలను ప్రకటించి ప్రత్యేక పని దినాలు పెంచాలి.
– పట్టణ పేదలకు కూడా పనిని విస్తరింపజేయాలి, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి.

వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గ్రామ, మండల కేంద్రాల్లోని మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద వ్యవసాయ కార్మిక సంఘం, దళిత గిరిజన వృత్తి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పోత్కునూరి ఉపేందర్, గోసంగి శంకరయ్య, నాయకులు సంకి నరేష్, పొలాస కిష్టయ్య, కుమ్మెర సుధా, కాకర్ల పద్మ, ఐలాపురం నరసమ్మ, కాకర్ల బాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.