📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పారిశుధ్య కార్మికుల సంక్షేమమే ధ్యేయం

పారిశుధ్య కార్మికుల సంక్షేమమే ధ్యేయం

📰 Generate e-Paper Clip

*పారిశుధ్య కార్మికుల సంక్షేమమే ధ్యేయం: ఘనంగా కల్వకుర్తిలో,సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శివిర్’ మెడికల్ క్యాంపు*

*నాగర్ కర్నూల్ జిల్లా…
కల్వకుర్తి*( సెప్టెంబర్ 30 ప్రజావాణి):*
కల్వకుర్తి మున్సిపల్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగింది, సమాజంలో ఎల్లప్పుడూ పరిశుభ్రతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న మున్సిపల్ మరియు పారిశుధ్య కార్మికుల (Safai Workers) ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం ప్రత్యేకంగా “సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శివిర్” వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నిత్యం ధూళి, చెత్తాచెదారం మధ్య శ్రమిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడే పారిశుధ్య కార్మికుల సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
ఉచిత వైద్య పరీక్షలు మరియు మందుల పంపిణీ: ఈ ప్రత్యేక మెడికల్ క్యాంపులో భాగంగా పారిశుధ్య కార్మికులందరికీ వైద్య సిబ్బంది సమక్షంలో బి.పి (Blood Pressure), షుగర్ (Blood Sugar) వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం అనారోగ్య సమస్యలు ఉన్నవారికి తగిన వైద్య సలహాలు ఇవ్వడంతో పాటు, ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్మికులు తమ విధులను నిర్వర్తించేటప్పుడు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై వైద్యులు ప్రత్యేక సూచనలు అందించారు.
ఆరోగ్య అవగాహన సదస్సు: ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ భీమ మాట్లాడుతూ.. కార్మికులు శారీరక శ్రమతో పాటు తమ ఆరోగ్యం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రోజువారీ ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, వృత్తిపరమైన హానికర పరిస్థితుల నుంచి రక్షణ పొందే మార్గాలపై కార్మికులకు విస్తృతమైన అవగాహన కల్పించారు. ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను, వైద్య సదుపాయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య మరియు ఆరోగ్య పరమైన సలహాలు, అవగాహన కల్పించారు)
కార్మికుల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు మున్సిపాలిటీ పరిధిలో నిరంతరం నిర్వహించాలని, పారిశుధ్య కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చైర్మన్: బృంగి రత్నమాల ఆనందకుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, అధికారులు డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ): డాక్టర్ భీమ మున్సిపల్ కమిషనర్: మొహమ్మద్ షేక్, సి.హెచ్.ఓ శ్రీనివాస్, ఎం.ఎల్.హెచ్.పి.ఎస్): వర్షిత్ రెడ్డి, ఎ.ఎన్.ఎం: భాగ్యలక్ష్మి, నాగలక్ష్మి. ఆశా కార్యకర్తలు శానిటేషన్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.