విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేయాలి
రైతుల సమస్యలపై విద్యుత్ శాఖ అధికారులకు బీజేపీ నాయకుల వినతి
బెజ్జంకి, సెప్టెంబర్ 30 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో రైతులకు విద్యుత్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ బీజేపీ బెజ్జంకి మండల అధ్యక్షుడు కొలిపాక రాజు ఆధ్వర్యంలో బుధవారం విద్యుత్ శాఖ ఏడీఈ సుధీర్‌బాబు,ఏఈ మహేష్‌లకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వరి పంట కీలక దశలో ఉందని, విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,బావులు,బోర్ల ద్వారా పంటలకు సకాలంలో నీరు అందకపోతే పంటలు దెబ్బతిని రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.వరి పంట చేతికి వచ్చే వరకు వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను కోతలు లేకుండా నిరంతరంగా సరఫరా చేయాలని కోరారు.రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బుర్ర మల్లేశంగౌడ్, సంఘ రవి, బండిపెల్లి సునీతగౌడ్, సీత భూమయ్య, దొమ్మాటి రాములు, వడ్లూరు సాయిలు, బెజ్జంకి రాజమల్లు, జెళ్ల అనిల్, సాన వేణు, బుర్ర కిషన్, లోనే నర్సింగం, ధోనే అంజన్న, బోనగం నరేష్, నేతి మహేష్, రావుల రాజిరెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

