బాహ్య మూల్యాంకన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
టిపిటిఎఫ్ జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్
ప్రజావాణి,నెల్లికుదురు:పరీక్ష పత్రాల బాహ్య మూల్యాంకన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని టి పి టి ఎఫ్ జిల్లా కార్యదర్శి సంఘ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.టీ పి టీ ఎఫ్ నెల్లికుదురు మండల శాఖ ఆధ్వర్యంలో బాధ్యులు యాకయ్య అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించారు. దీనికి జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ పాఠశాలలో రేపటి నుండి జరిగే సమ్మేటివ్ పరీక్ష పత్రాలను మండల కేంద్రాల్లో మూల్యాంకనం చేయాలని ప్రభుత్వం ఆదేశించడం వల్ల కేవలం మార్కులు, గ్రేడ్ ల వెంట విద్యార్థులను పరుగెత్తే లాగా చేసే చర్య అవుతుందని, ఫలితాలకోసం మాస్ కాపీయింగ్ ప్రోత్సహించే సంస్కృతి పెరుగుతుందని,ఇప్పటికే విద్యావేత్తలు, ప్రజలు అభిప్రాయపడుతున్న సందర్భంలో ఇలాంటి నిర్ణయం ప్రాథమిక స్థాయిలో కూడా అదే రకమైన ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. ఇది ఉపాధ్యాయులను కించపరిచే చర్య అని , దీని వల్ల విద్యా వ్యవస్థకు ఎలాంటి ప్రయోజనం లేక పోగా ప్రభుత్వానికి ఆర్థిక భారం పడుతుందని అన్నారు. సబ్జెక్టు టీచర్ అందుబాటులో లేకుండా విద్యార్థి పరీక్ష వ్రాయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని,ఈ విధానం వల్ల విద్య అంటే మూల్యాంకనం మాత్రమే అన్నట్టు విద్యాశాఖ ఆలోచించడం ఒకసారి కాదన్నారు. ఇది విద్యా లక్ష్యాలకే విరుద్ధమని తెలిపారు. ప్రభుత్వం ఇలాంటి విద్యా వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు,పద్మావతి,రాజు,నవీన్ పాల్గొన్నారు.

