పోషకాహారంపై తల్లిదండ్రులకు అవగాహన
బెక్కల్ అంగన్వాడి కేంద్రంలో ఘనంగా పోషణ మాసం
మద్దూరు సెప్టెంబర్ 30, ప్రజా వాణి,
మండలంలోని బెక్కల్ 1, శివాలి తండా2వ అంగన్వాడి కేంద్రాల్లో బుదవారం పోషణ మాసంలో భాగంగా పోషకాహారం పై గర్భిణీలు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోషకాహారం తీసుకోవడం ద్వార కలిగే లాభాలను తెలియజేశారు. ముఖ్యంగా మనం తీసుకొనే ఆహారంలో ఆకు కూరలు, గుడ్లు, పాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నలగొప్పుల రేణుక రాములు, వార్డు సభ్యులు గుండె అనూష, మద్దూరు మండల వి ఓ సంఘం అధ్యక్షురాలు స్రవంతి, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు తల్లులు పాల్గొన్నారు.

