బొక్క కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన కేటీఆర్
పట్టభద్రుల ఓటరు నమోదు 100 శాతం పూర్తి చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సూచన
హసన్‌పర్తి, అక్టోబర్ 31 (మన ప్రజావాణి):
హసన్‌పర్తి 66వ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొక్క కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
అనంతరం కేటీఆర్ బొక్క కుమార్‌కు శాలువా కప్పి, పూల మొక్కను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. హసన్‌పర్తి మండలంలో ప్రతి బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేస్తూ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను 100 శాతం పూర్తి చేసేలా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హసన్‌పర్తి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బండి రజినీకుమార్, సీనియర్ నాయకులు నద్దునూరి నాగరాజు, గిన్నారపు రవీందర్, పుల్ల నరేష్, చరణ్, సోనియా రాజ్ తదితరులు పాల్గొన్నారు.

