*రాష్ట్రీయ గోర్ సేన గూడూరు మండల అధ్యక్షుడిగా భూక్యా వీరు నాయక్ నియామకం!*
*గోర్ బంజారా సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు యువత ముందుకు రావాలి*
*జిల్లా అధ్యక్షుడు బానోత్ సురేష్ నాయక్*
గూడూరు మండల ప్రతినిధి:- నవంబర్ 01. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలో రాష్ట్రీయ గోర్ సేన ఆధ్వర్యం లో నూతన కమిటీ నియామక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బానోత్ సురేష్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా రవిసింగ్ నాయక్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు సబావట్ మహేందర్ నాయక్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో, గూడూరు మండల, పట్టణ స్థాయి నూతన కమిటీలను ప్రకటించారు. ఈ సందర్భంగా గూడూరు మండల అధ్యక్షుడిగా భూక్యా వీరు నాయక్, మండల ప్రధాన కార్యదర్శిగా నవీన్ నాయక్, గూడూరు పట్టణ ఉపాధ్యక్షుడిగా గుగోలోత్ కళ్యాణ్ నాయక్, పట్టణ ప్రధాన కార్యదర్శిగా ధరావత్ విజయ్ నాయక్లను నియమించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బానోత్ సురేష్ నాయక్, మాట్లాడుతూ… సద్గురు సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. గోర్ బంజారా జాతి సంస్కృతి, సంప్రదాయాలు, మాతృభాష, ప్రత్యేక వేషధారణ, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించేందుకు రాష్ట్రీయ గోర్ సేన జాతీయ స్థాయిలో కృషి చేస్తోందని తెలిపారు. గోర్ బంజారా సమాజం సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయం గా ఎదుర్కొంటున్న సమస్యల పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. సమాజం లోని యువత, యువతులు విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో ముందుకు సాగుతూ జాతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ముఖ్యంగా గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలు, దాడులు, వివక్షకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడి హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపును ఇచ్చారు. వరంగల్ జిల్లా అధ్యక్షుడు సపావట్ మహేందర్ నాయక్ మాట్లాడుతూ… గోర్ బంజారా యువతీ, యువకులు సామాజిక చైతన్యంతో ముందుకు రావాలని, సద్గురు సేవాలాల్ మహారాజ్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని అన్నారు. సమాజ ఐక్యత, విద్యాభివృద్ధి, సంస్కృతి పరిరక్షణ కోసం యువత క్రియాశీలకంగా పని చేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులు తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ రాష్ట్రీయ గోర్ సేన బలోపేతానికి, గోర్ బంజారా సమాజ అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ గోర్ సేన నాయకులు, సభావట్ అమృ నాయక్. బానోత్ మంగీలాల్ నాయక్, బాదావత్ రమేష్ నాయక్ రాములు తండా సర్పంచ్, గోర్ బంజారా యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

