📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆపదలో మహిళకు అండగా పోలీసులు

ఆపదలో మహిళకు అండగా పోలీసులు

📰 Generate e-Paper Clip

*ఆపదలో మహిళకు అండగా పోలీసులు*

-ఎల్లారెడ్డిపేట కానిస్టేబుల్, హోంగార్డు సేవలకు డీజీపీ అభినందనలు

మన ప్రజావాణి / ఎల్లారెడ్డిపేట:

ఆపదలో ఉన్న మహిళకు సకాలంలో సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులకు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అభినందనలు తెలిపారు.

ఎల్లారెడ్డిపేట మండలంలోని మొదటి బైపాస్‌ రోడ్డుపై ఫిట్స్‌తో ఓ మహిళ అకస్మాత్తుగా కుప్పకూలడాన్ని గమనించిన కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్ వెంటనే స్పందించారు. ఆమెకు ప్రథమ చికిత్స అందించి అవసరమైన సహాయం చేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి మహిళకు అండగా నిలవడంపై పలువురు ప్రశంసలు కురిపించారు.

ఈ ఘటనపై జిల్లా పోలీసు శాఖ సోషల్‌ మీడియాలో చేసిన పోస్టును పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు. విధి నిర్వహణలో బాధ్యతతో పాటు మానవత్వాన్ని చాటుకున్న పోలీసులను అభినందించారు. వారి సేవలను గుర్తించి తగిన రీతిలో ప్రశంసించడంతో పాటు రివార్డులు అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.