*దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు ఎమ్మెల్యే సునీతలక్ష్మారెడ్డి*
-చిలిపిచెడ్ మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
-రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
-మద్దతు ధర రూ.3100-3200 కు పెంచాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే డిమాండ్
-నగదు ఇచ్చిన వారికే ధాన్యం ఇవ్వండి
చిలిపిచెడ్.అక్టోబర్ 31 మన ప్రజావాణి నియోజకవర్గం ప్రతినిధి.
చిలిపిచెడ్ మండలంలోని సోమక్కపేట సొసైటీ ఆధ్వర్యంలో సోమక్కపేట, చిలిపిచెడ్, చిట్కుల్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో శిలంపల్లి, రాందాస్ గూడ, చండుర్, చిట్కుల్ కొనుగోలు కేంద్రాలు నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు ఏ గ్రేడ్ రకం కు 2461 రూపాయి,బి గ్రేడ్ రకం కు 2441 రూపాయలు నిర్ణయించింది. రైతులకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది సద్వినియోగం చేసుకోవాలి. గతంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు రైతులకు లాభం జరిగింది అన్నారు. గత సీజన్లో ట్రాన్స్ పోర్ట్ లారీలు లేక నష్టం జరిగింది. కచ్చితంగా ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచన చేస్తున్నా. వడ్ల కొనుగోలు ప్రారంభించిన సెంటర్లకు రైస్ మిల్ అలాట్మెంట్ చేయాలి, గని బ్యాగుల సప్లై అందించాలి. ఏలినో ప్రభావంతో ఇతర రాష్ట్రాల వారువచ్చి వడ్ల కొనుగోలు చేస్తున్నారు. దీని ద్వారా రైతులకు లాభం జరుగుతుంది, పచ్చి వడ్లకు 3600 నుండి 3300 వరకు కొనుగోలు చేస్తున్నారు. దాలర్లకు వడ్లు అమ్మి రైతులు నష్టపోవద్దు, గత లాస్ట్ సీజన్లో శివంపేట్ మండలో ఒక సంఘటన జరిగింది, రైతులు నష్టపోయారు. మన ప్రాంత రైస్ మిల్లర్లు వచ్చి తీసుకుంటే మనకు లాభం జరుగుతుంది. బైటివారికి ఇచ్చిరైతులు నష్టపోకండి. నగదు డబ్బులు ఇచ్చినవారికి ధాన్యం ఇవ్వండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఇతర రాష్ట్రాల నుండి వచ్చి రైతులు పండించిన సన్న వడ్లను తీసుకెళ్తున్నారు, వారివద్ద లేదు కాబట్టి ప్రభుత్వం స్పందించి 3100, 3200 మద్దతు ధర పెంచి రైతుల నుండి వడ్లు కొనుగోలు చేయాలి. రైతు పండించిన వడ్లని మనం సేకరించకపోతే, రేపు పొద్దున మనం ఇచ్చే పిడిఎఫ్ బియ్యానికి గండి కొట్టే అవసరం ప్రభుత్వానికి ఏర్పడుతుంది. ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లాలి, వడ్ల సేకరణ చేయాలి ఇటు రైతులకు లాభం ప్రజలకు మేలు జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివప్రసాద్, ,ఎంపీడీవో ప్రవీణ్ ,ఏ ఈ ఓ కృష్ణవేణి , వంశీ కృష్ణ, చిలిపిచెడ్, ఎ పీ ఎం గౌరీ శంకర్ మండలం బీఆర్ఎస్,పార్టీఉపాధ్యక్షుడు బెస్తలక్ష్మణ్,సోమక్కపేట సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ సీఈఓ దత్తాత్రే , నర్సింలు, ప్రజాప్రతినిధులు, శ్రీకాంత్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రాములు, విఠల్, యాదగిరి,విటల్, అనిల్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


