📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపదవీ విరమణ బెన్ఫిట్స్ వెంటనే అందించాలి

పదవీ విరమణ బెన్ఫిట్స్ వెంటనే అందించాలి

📰 Generate e-Paper Clip

పదవీ విరమణ బెన్ఫిట్స్ వెంటనే అందించాలి:
టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత
ప్రజావాణి,నెల్లికుదురు: పదవీ విరమణ పొందిన వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మండలంలోని జెడ్పిహెచ్ఎస్ మునిగలవీడు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు గుడిబోయిన ప్రసాదరావు పదవి విరమణ సన్మానోత్సవానికి జిల్లా అధ్యక్షులు బాలాష్టి రమేష్, ప్రధాన కార్యదర్శి సంఘ శ్రీనివాస్ ప్రభృతులతో కలిసి శనివారం హాజరై ప్రసాదరావును ఘనంగా సన్మానించారు. అనంతరం కవిత మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న డి ఏ లను, పీఆర్సీనీ వెంటనే ప్రకటించాలని,డి ఎ బకాయిల వల్ల రిటైర్ అవుతున్న ఉద్యోగులు పొందే పెన్షన్లో నష్టపోతున్నారని, పదవి విరమణ ప్రయోజనాలైనా జిపిఎఫ్, టీఎస్జీఎల్ఐ ,లీవ్ ఎన్ క్యాష్ మెంట్ వంటి ప్రయోజనాలను వెంటనే అందించడంలో ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.

*సరైన ఫిట్మెంట్ ప్రకటించాలి: రమేష్*

జిల్లా అధ్యక్షులు బాలాష్టి రమేష్ మాట్లాడుతూ పిఆర్సి గడువు ముగిసి మూడు సం.లు పూర్తయిన నేటి వరకు పిఆర్సి కమిషన్ నుండి రిపోర్టును తెప్పించుకోక పోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని, రిపోర్టును తెప్పించుకొని ఉద్యోగులకు సరైన ఫిట్మెంట్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిటైర్ అవుతున్న ప్రసాద్ రావు వృత్తి నిబద్ధతకు, సమయపాలనకు పెట్టింది పేరని ఎంతోమంది విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దిన ఉత్తమ గురువని ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు, ఏఏపిసి చైర్మన్ కె.చైతన్య,టి పి టి ఎఫ్ జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్, పిఆర్టియు మండల అధ్యక్షులు యుగేందర్ వివిధ సంఘాల ఉపాధ్యాయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.