📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్డబ్బుకు అమ్ముడుపోయిన ఆర్వో ప్రవీణ్ ను సస్పెండ్ చేయాలి - సీపీఐ, సీపీఎం డిమాండ్

డబ్బుకు అమ్ముడుపోయిన ఆర్వో ప్రవీణ్ ను సస్పెండ్ చేయాలి – సీపీఐ, సీపీఎం డిమాండ్

📰 Generate e-Paper Clip

21వ వార్డులో వామపక్ష అభ్యర్థుల పేర్లు అక్రమంగా తొలగింపు – కలెక్టర్, ఎన్నికల కమిషన్, హైకోర్టును ఆశ్రయిస్తాం

బద్వేల్ అక్టోబర్ 26 ప్రజావాణి  మున్సిపాలిటీ ఎన్నికల్లో అవినీతికి పాల్పడి, వామపక్ష అభ్యర్థులను ఎలాంటి సమాచారం లేకుండా తొలగించిన రిటర్నింగ్ అధికారి (ఆర్వో) ప్రవీణ్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని సీపీఐ, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.సోమవారం సీపీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి.వీరశేఖర్, సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు చిన్ని మాట్లాడారు.”19న ఆమోదం,25న ఏకగ్రీవం ఎలా?ఈనెల 16 నుండి 18 వరకు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో సీపీఐ అభ్యర్థిగా పెద్దలపల్లి మేరీ, సీపీఎం అభ్యర్థిగా మోక్షమ్మ 21వ వార్డులో నామినేషన్లు వేశారు. 19వ తేదీ స్క్రూటినీలో వారి పేర్లను ఆమోదించిన ఆర్వో ప్రవీణ్, 25వ తేదీ మధ్యాహ్నం వరకు అదే విషయం చెప్పి, సాయంత్రం 6 గంటలకు ఏకగ్రీవమని ప్రకటించారని వారు ఆరోపించారు.”డబ్బులకు లొంగిపోయి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని, అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పేర్లు తొలగించి ఏకగ్రీవమని ప్రకటించడం నీచమైన చర్య” అని వారు మండిపడ్డారు.కూటమి ఇన్ చార్జ్ పై విమర్శలు:టీడీపీ నూతన ఇన్ చార్జ్ సూర్యనారాయణ రెడ్డి వామపక్షాలు 21వ వార్డులో ఉన్నా, మున్సిపాలిటీలోకి ఎర్రజెండా ప్రతినిధులు వస్తారనే భయంతో ఈ విధంగా చేయించారని ఆరోపించారు.ఆయన పక్కన ఉన్న బడా గుంటనక్కలు ఇచ్చే పనికిమాలిన సలహాలతో కమ్యూనిస్టులపై తప్పుడు సమాచారం ఇచ్చి అభ్యర్థులను తొలగించారు. ఇది దౌర్భాగ్యమైన చర్య. రేపు అదే గుంటనక్కలు ఆయన్ను ఊబిలోకి నెట్టి ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తారు” అని హెచ్చరించారు.ప్రజాక్షేత్రంలో గెలవాలి:”అధికార పార్టీ కూటమిలో ప్రతి పదవికి ఒక రేటు కట్టారని వారి నేతలే బహిర్గతం చేస్తున్నారు. ఎన్నికలంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మనసు గెలిచి ఓట్లు వేయించుకుని గెలవాలి. కానీ అధికార, ఆర్థిక, అంగబలంతో ఎన్నికలను నిర్వహించడం సిగ్గుచేటఅని 25 సంవత్సరాలుగా కమ్యూనిస్టుల చేతిలో ఉన్న పేదల కాలనీ అయిన 21వ వార్డులో మమ్మల్ని ఇలా అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. 40 వార్డుల్లో 39 వార్డులు ఏకగ్రీవం అంటే పోటీ చేసేవారే లేరా?” అని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్వం చేతులెత్తే ప్రక్రియతో సెలక్షన్ చేసేవారట, అలాగే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చేతులెత్తే ప్రక్రియ పెడితే బాగుండు” అని ఎద్దేవా చేశారు.ఈ అక్రమాలకు కారణమైన ఆర్వో ప్రవీణ్ పై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో కలెక్టర్, ఎన్నికల కమిషన్ ను ఆశ్రయిస్తామని, అవసరమైతే హైకోర్టుకు వెళ్తామని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకున్నా కమ్యూనిస్టులు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రశ్నిస్తూనే ఉంటారని, పాలక ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సీపీఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, సహాయ కార్యదర్శులు పి.వి.రమణ, ఇమ్మానియేల్, కార్యవర్గ సభ్యులు పడిగే వెంకటరమణ, పొంగూరు నాగరాజు, గూడూరు పెంచలయ్య, సీపీఎం నాయకులు మస్తాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.