ఘట్‌కేసర్, అక్టోబర్ 26 (ప్రజావాణి): ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)గా బాధ్యతలు చేపట్టిన పి. కిరణ్‌ను మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన ఎస్‌హెచ్‌ఓ పి. కిరణ్‌కు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ అడహాక్ కమిటీ సభ్యుడు వేముల సంజీవ్ గౌడ్, టీడీపీ సీనియర్ నాయకులు సామల జగన్మోహన్ రెడ్డి, బొట్టు సూర్యనారాయణ, పాటి సురేందర్ రెడ్డి, మడ్డి రాముగౌడ్, టి. మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

