యాసంగి వరి పంట వద్దు ఆరుతడి పంటలే సాగు చేయాలి
ప్రజావాణి అక్టోబర్ 26 కమలాపూర్ మండల్ పంగిడిపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కేతి బచావో కార్యక్రమం కింద రైతులకు అవగాహన కల్పించారు వ్యవసాయ అధికారి వేణు మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న ఎల్ ని ఓ దృశ్య రైతు సోదరులు యాసంగిలో వరి పంట సాగు చేయకూడదని సూచించారు
ఎందుకనగా ఎల్ ని ఓ దృశ్య భూగర్భ జలాలు తగ్గడం విద్యుత్ సరఫరలో అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున వరి పంట వేసి నష్టపోకూడదు అనే రైతులకు తగు జాగ్రత్తలు వివరించారు భూగర్భ జలాలను కాపాడి భవిష్యత్తు పంటలకు భరోసా కల్పించాలి తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోండి రైతు ఆదాయాన్ని కాపాడుకోండి ఎల్ ని ఓ వేల అప్రమత్తంగా ఉండండి వ్యవసాయ అధికారుల సూచనలతోనే పంటల సాగు చేయండి నీటిలభ్యతే సాగుకు ఆధారం ఆచితూచి పంటల ఎంపికే రైతుకు శ్రేయస్కార ప్రణాళికలో జాగ్రత్త రైతన్నకు ఆర్థిక భద్రత నీరు తక్కువ విద్యుత్ కొరత సాగులో ముందస్తు ప్రణాళిక కే రైతుకు రక్ష ఎల్ ని ఓ ప్రభావం రైతన్న అప్రమత్తం నీటి లభ్యతను అంచనా వేసి పంటలు ఎంచుకోండి విద్యుత్ నీటిపై ఆధారపడే పంటల విషయంలో జాగ్రత్త వహించండి తక్కువ నీటితో పండే ప్రత్యేక పంటలను పరిశీలించి రైతు సోదరులారా ముందస్తు ప్రణాళికతో సాగు చేసి నష్టాలను తగ్గించుకోవాలని అన్నారు

