📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఎన్నికల్లో భారీ ఎత్తున అక్రమాలు, దౌర్జన్యాలు నోటిఫికేషన్ రద్దుచేసి తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలి పోతిరెడ్డి నాగార్జున...

ఎన్నికల్లో భారీ ఎత్తున అక్రమాలు, దౌర్జన్యాలు నోటిఫికేషన్ రద్దుచేసి తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల,అక్టోబర్ 25 ప్రజావాణి ఆంధ్ర ప్రదేశ్ లో పరిషత్ ఎన్నికల్లో భారీ ఎత్తున అక్రమాలు చేయడం జరిగిందని. నోటిఫికేషను రద్దు పరచి.తిరిగి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు.ఆయన మాట్లాడుతూ.మండల పరిషత్.జడ్పిటిసి.ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున అక్రమాలు దౌర్జన్యాలు లకు పాల్పడిందని. వైఎస్ఆర్సిపి నాయకులపై అభ్యర్థులపై భౌతిక దాడులు చేయడం మళ్ళీ వారిపైనే కేసులు పెట్టడం. పోలీస్ అధికారులు ఏకపక్షం గా అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ఉండడం,పోలింగ్ అధికారులు కూడా అధికార పార్టీ నాయకులు చెప్పినట్లుగా.వైసిపి అభ్యర్థుల నామినేషన్ ఫారాల్లో పేపర్లను తొలగించి వారి నామినేషన్లను తిరస్కరించడం జరిగిందని ఈ విధంగా రాష్ట్రంలో అనేక చోట్ల చేయడం జరిగిందని. వైసిపి అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి పోతే వారి అప్లికేషన్లు చించి వేయడం వారి పై దాడులు చేయడం.పోలీసులు అధికారుల సమక్షంలో జరుగుతున్నను ఏమి ఎరగనట్లు కళ్ళు లేని కబోదిల్లాగా చూస్తు ఉండిపోయారని విమర్శించారు,.సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఎన్నికల కమిషన్ మరియు.రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని,ఐ.ఏ.ఎస్ఐ.పీ.ఎస్. సీనియర్ అధికారుల సమక్షంలో దౌర్జన్యాలు చేస్తున్నాను వారిపై చర్యలు తీసుకోకుండా ఉండడం చూస్తుంటే ఐఏఎస్.ఐపీఎస్.అధికారులు కూడా దిగజారి విధులు నిర్వహిస్తున్నారు అనుకోవడం చాలా బాధాక మైనది అని. గతంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే ప్రజల్లో గౌరవం మర్యాద ఉండేదని ఇప్పుడు వారు ఎంత దిగజారి విధులు నిర్వహిస్తుండడం చూస్తుంటే,కిందిస్థాయి ఉద్యోగులు ఏ విధంగా పనిచేస్తారు చెప్పనవసరం లేదని రాష్ట్రం మొత్తంగా పోలీసు వ్యవస్థ బ్రష్టుపట్టిందని ప్రజలు .విపక్షాలు వాపోతున్నాయని అన్నారు. గతంలో ఎన్నడూ ఇటువంటి సంఘటనలు చూడలేదని వామపక్ష నేతలు కూడా ఘాటుగా విమర్శిస్తున్నారని.దేశం యావత్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరుగుతున్న దౌర్జన్యాలు అక్రమాలు చూస్తూ ఆశ్చర్యపోతున్నారని.ఒకపక్క ఓట్ల చోరీ కార్యక్రమం లో దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారని. ఆంధ్రప్రదేశ్లో,ఈ.వీ.ఎం.లు మోసంతో కూటమి.పార్టీ అధికారంలోకి వచ్చిందని సాక్షాధారాలతో సహా రుజువులు బయటపడ్డాయని.ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టకపోతే బిజెపి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారని నాగార్జున్ రెడ్డి అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.