📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్11, 12, 13వ డివిజన్లలో అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి

11, 12, 13వ డివిజన్లలో అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి

📰 Generate e-Paper Clip

11, 12, 13వ డివిజన్లలో అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్*

ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 25

ఒంగోలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలు నగరంలోని 11, 12, 13వ డివిజన్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ తెలిపారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి బలపరిచిన మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపిస్తే నగరంలో మరింత అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా 11వ డివిజన్‌లోని పులి వెంకటరెడ్డి కాలనీ, ఇందిరా కాలనీ, జాషువా కాలనీ, 12వ డివిజన్‌లోని రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, 13వ డివిజన్‌లోని కొప్పోలు గ్రామంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూటమి బలపరిచిన టీడీపీ మేయర్ అభ్యర్థి శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప స్థానిక కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో నాయకులకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి మేయర్ అభ్యర్థి శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప గారితో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో ఒంగోలు నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బి. విజయలక్ష్మి, షేక్ వలి, మందా డేవిడ్, కారంశెట్టి సాయి, బీజేపీ నాయకులు పి. తిరుమలరావు, డేగ సురేష్, హరీష్, శివాజీ యాదవ్, హరి; 12వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కల్లూరి ప్రసన్న, టౌన్ బీసీ సెల్ అధ్యక్షులు దొడ్డక చంద్రశేఖర్, డివిజన్ అధ్యక్షులు వడ్లమూడి మునీంద్ర, మానేపల్లి గోవిందాచారి, యలవర్తి శివకృష్ణ, పారా రమేష్, గోనుగుంట సుబ్బారావు, బత్తిన కృష్ణమూర్తి, కళ్యాణ్; 13వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గద్దల శ్రావణ్ కుమార్, కాట్రగడ్డ రఘుపతి, ఉన్నం నరసింహారావు, ఈదర వంశీ, షేక్ కాలే మస్తాన్, ప్రసన్న వెంకట స్వామి తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.