మంచాల హరిహర మహాక్షేత్రంలో ఆల్ ఫ్రెండ్స్ యూత్ ఇంచార్జ్
*జక్క చంద్రశేఖర్ ఘనంగా ప్రత్యేక పూజలు*
కులమత, రాజకీయ భేదాలకు అతీతంగా భక్తుల భాగస్వామ్యం
మంచాల, సెప్టెంబర్ 16 (ప్రజావాణి): మంచాల గ్రామంలోని హరిహర మహాక్షేత్రంలో ఆల్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని రెండవ రోజు. ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
కులమత, రాజకీయ భేదాలకు అతీతంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహానికి పంచామృత అభిషేకం, ప్రత్యేక అలంకరణ, అర్చనలు తదితర పూజా కార్యక్రమాలను వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆల్ ఫ్రెండ్స్ యూత్ ఇంచార్జ్ జక్క చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐకమత్యంతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు.
విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తి వాతావరణంలో కొనసాగాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. కార్యక్రమంలో ఆల్ ఫ్రెండ్స్ యూత్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, యువత, భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.
సామాజిక ఐక్యతకు ప్రాధాన్యమిస్తూ కులమత, రాజకీయ భేదాలు లేకుండా అందరినీ కలుపుకుని కార్యక్రమాన్ని నిర్వహించిన. ఆల్ ఫ్రెండ్స్ యూత్. అధ్యక్షుడు. ఓ శేఖర్ గౌడ్. ప్రధాన కార్యదర్శి. సుఖేష్ రెడ్డి. అజయ్.జయ రామ్ రెడ్డి.రావుల లింగం. రాజారామ్. యూత్ సభ్యులు. పాల్గొని జక్క చంద్రశేఖర్‌ను పలువురు అభినందించారు.
