విద్యార్థులనువేధిస్తున్న ఉపాధ్యాయుడు రామ్ రాజయను సస్పెండ్ చేయాలని డిమాండ్
* తల్లులకు అసభ్యంగా మెసేజీలు చేస్తున్న ఉపాధ్యాయుడురాజయ్య
* రామ్ రాజయ్య అనే ఉపాధ్యాయుడిపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేశారు
జమ్మికుంట సెప్టెంబర్ 15 (ప్రజావాణి)
జమ్మికుంట జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న రామ్ రాజయ్య అనే ఉపాధ్యాయుడిపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేశారు ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం గిల్లడం టార్చర్ చేయడం అభ్యంతరకరమైన వీడియోలు చూపించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలిపినట్లు సమాచారంఅంతేకాకుండా విద్యార్థుల తల్లులకు సైతం అనుచితంగా మెసేజ్‌లు పంపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయిఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి పిటిషన్ సమర్పించినట్లు తెలిసిందిపాఠశాలలో పిల్లలకు రక్షణ లేదావిద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడిపై ఇలాంటి ఆరోపణలు రావడం తీవ్ర చర్చకు దారితీసింది విద్యార్థులు చేసిన ఆరోపణలు నిజమా కాదాఅనే విషయంపై పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలలో విద్యార్థుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయివిద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో అధికారులు వెంటనే స్పందించి ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి తప్పు చేసినట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

