📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఆళ్లగడ్డ లో వినాయక నిమజ్జన కార్యక్రమo పై ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులతో డిఎస్పీ సమావేశం

ఆళ్లగడ్డ లో వినాయక నిమజ్జన కార్యక్రమo పై ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులతో డిఎస్పీ సమావేశం

📰 Generate e-Paper Clip

ఆళ్లగడ్డ సెప్టెంబర్ 15 ప్రజావాణి ఆళ్లగడ్డ పట్టణంలో మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు వినాయక నిమజ్జన కార్యక్రమాలపై ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులతో ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాసరావు సమావేశం నిర్వహించి సూచనలు,హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టణంలో 93 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందని.16వ తేదీన కొన్ని విగ్రహాలు నిమజ్జనం జరుగుతుందని. 18వ తేదీన ఎక్కువ విగ్రహములను నిమజ్జనం చేయబోతున్నారన్నారు. ఈ వినాయక నిమజ్జన ఘాటును కాశీంతల క్షేత్రం లో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్వాహకుడు రామ పుల్లయ్య గని గుంతలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ గని గుంతదాదాపు 40 అడుగుల లోతు నీళ్లు ఉన్నాయని నిమజ్జనానికి అనుకూలంగా ఉంటుందన్నారు. వినాయక నిమజ్జనం తరలింపులో ట్రాక్టర్ల డ్రైవర్లు బహు జాగ్రత్తగా ఈ ప్రాంతానికి తీసుకురావలసి ఉన్నది అన్నారు. అధిక ఎత్తు ఉన్న విగ్రహాలను నాలుగు రోడ్ల సర్కిల్ నుండి కోర్టు రోడ్డు మీదుగా కాశింతల ఘాట్ వరకు రావాలని తక్కువ ఎత్తు ఉన్న విగ్రహంల తరలింపు అహోబిలం దారి నుండి కాశింతల నిమజ్జనం ప్రాంతానికి తీసుకోని రావచ్చన్నారు. నిమజ్జనంలో పాల్గొనే ట్రాక్టర్ డ్రై వర్లు మద్యం సేవించి నడపరాదన్నారు,నిమజ్జనంలో పాల్గొనే వ్యక్తులు మద్యం సేవించి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని సూర్యాస్తమయం లోపల ముగించాలన్నారు. స్త్రీలు వృద్ధులు ఘాటు వద్దకు రాకుండా చూసుకోవాలని ఏర్పాట్ల నిర్వాహకులకు తెలియజేశారు. నిమజ్జన విగ్రహాల తరలింపు నుండి నిమజ్జన ఘాటు వరకు పటిష్టమైన భద్రత చేపట్టనున్నట్లు తెలిపారు.పట్టణ సిఐ నాగరాజా రావు మాట్లాడు గణేశ ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని నిమజ్జన కార్యక్రమం లో ఎలాంటి ఘర్షణలు గాని,ప్రమాదాలు గానీ ముఖ్యంగా విద్యుత్ తీగల సరఫరాల విషయంలో బహు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.అన్ని విగ్రహాల నిమజ్జనo జరిగి ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్లే వరకు పోలీసు పర్యవేక్షణ నిర్వహిస్తామన్నారు.కేంద్ర ఉత్సవ కమిటీ సభ్యులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నిర్వాహకులమంతా పోలీసు వారికి సహకరిస్తామని బాధ్యతగా వ్యవహరిస్తామన్నారు.ఎ లాంటి ఘర్షణలకు తావు లేకుండా ప్రమాదాలు జరగాకుండా ఐకమత్యంగా పని చేస్తామన్నారు. కొత్త ప్రాంతంలో నిమజ్జనం జరుగుతున్నందున పోలీసు వారి సూచనలను పాటించి భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహించుకుందాం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్,ఫైర్ స్టేషన్ సిబ్బంది,విద్యుత్ శాఖశివశంకర్,ఆళ్లగడ్డ డిప్యూటీ తాహసిల్దార్ నర్సిరెడ్డి, ఉత్సావ కమిటీ సభ్యులు,మండపాల నిర్వహకులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.