డీజే పెడితే కేసే..!
వినాయక చవితికి హసన్‌పర్తిలో పటిష్ట పోలీస్ భద్రత
భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించాలి.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి: సీఐ ఏ. మహేందర్
హసన్‌పర్తి:రిపోర్టర్ ప్రణయ్ గొర్రె :
వినాయక చవితి పండుగను మండల ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని హసన్‌పర్తి సీఐ ఏ. మహేందర్ సూచించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
వినాయక ప్రతిష్ఠకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించే నిర్వాహకులు పోలీస్ శాఖ సూచించిన వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సీఐ సూచించారు. మండపాల వద్ద కార్యక్రమాల నిర్వహణలో పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
డీజేలకు అనుమతి లేదు
వినాయక నిమజ్జనం, ఇతర వేడుకల సందర్భంగా డీజేలు వినియోగించేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
శాంతియుత వేడుకలకు పోలీసుల పిలుపు
ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా, భక్తి భావంతో నిర్వహించుకోవాలని హసన్‌పర్తి పోలీసులు విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు

