ఇన్చార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవతో నెరవేరిన కల
* రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్, కాశినాయన మండలం నాయకులు కర్నాటి వెంకట్ రెడ్డికి గ్రామస్తుల ఘన కృతజ్ఞతలు
* ఆటో ప్రయాణాల ముప్పు తప్పిందని హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు, మహిళలు
బద్వేల్ కాశినాయన సెప్టెంబర్ 15 ప్రజావాణి మండలం:గత 13 సంవత్సరాలుగా రవాణా సౌకర్యానికి నోచుకోక,తీవ్ర ఇబ్బందులు పడుతున్న పలు గ్రామ ప్రజల దశాబ్ద కాలపు నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది.బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని కోడిగుడ్లపాడు, చినాయిపల్లి, కొండ్రాజుపల్లె, బసనపల్లె, చెన్నవరం, రెడ్డి కొట్టాల, కే.ఎన్. కొట్టాల, మరియు రంపాడు గ్రామాలకు నూతనంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం పునరుద్ధరించబడింది. బద్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు, చొరవతో ఈ రూట్ లో బస్సు సర్వీసును బుధవారం ఘనంగా ప్రారంభించారు.13 ఏళ్ల గోస.. ప్రమాదకర ప్రయాణాలు గత 13 సంవత్సరాలుగా ఈ గ్రామాలకు ఎలాంటి ప్రభుత్వ రవాణా సదుపాయం లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, నిత్యం వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వెళ్లే మహిళలు, అత్యవసర వైద్య సేవలు అవసరమైన రోగులు బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేట్ ఆటోలు, ఇతర సొంత వాహనాలను ఆశ్రయించడం వల్ల నిత్యం ప్రమాదాల బారిన పడాల్సి వచ్చేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అనేకమార్లు డిపో అధికారులకు, పాలకులకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని స్థానికులు కొనియాడారు. ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతల జల్లా తమ చిరకాల కోరికను మన్నించి, బస్సు సౌకర్యం కల్పించినందుకు గాను బద్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి కి, కాశినాయన మండలం ముఖ్య నాయకులు కర్నాటి వెంకట్ రెడ్డి గారికి, అలాగే విజ్ఞప్తిని తక్షణమే ఆమోదించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కి గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల కనీస అవసరాల సాధనకు మంచూరి సూర్యనారాయణ రెడ్డి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కొనియాడారు.
పండుగ వాతావరణంలో ప్రారంభోత్సవం
గ్రామాల్లోకి తొలిసారిగా ప్రవేశించిన ఆర్టీసీ బస్సుకు స్థానికులు, నేతలు పూలమాలలు వేసి, హారతులు ఇచ్చి పండుగ వాతావరణంలో ఘన స్వాగతం పలికారు. ఈ శుభపరిణామాన్ని పురస్కరించుకుని గ్రామాల్లో మిఠాయిలు పంచి సంతోషాన్ని పంచుకున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు, గ్రామస్తులు:
ఈ బస్సు సౌకర్య సాధనలో మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇందులో పిచ్చ పాట రామకృష్ణారెడ్డి, గుర్రాల బాల వెంకటరెడ్డి, పసుపులేటి సాయి ప్రసాద్, గుర్రాల రమణారెడ్డి, ఐలూరి రాజారెడ్డి, వెన్నపూస ముని ఆంజనేయులు రెడ్డి, వెన్నపూస గురు రెడ్డి, తలపురెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి, శిలoమూర్తి రెడ్డి, కర్నాటి తేజరెడ్డి, జంగా ప్రభాకర్ రెడ్డి, అయిలూరి నరసింహారెడ్డి, హైలూరి చంద్రారెడ్డి, జాదవ్ వెంకటేశ్వర్లు, ఎదురు భాస్కర్ రెడ్డి, కత్తెరగండ్ల శ్రీనివాసులు (ఆచరి) లతో పాటు ఆయా గ్రామాల ప్రజలు, టిడిపి నాయకులు యువకులు, మహిళలు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

