📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు: రోడ్డు భద్రతపై ..అరైవ్ - అలైవ్.. ప్రతిజ్ఞ చేయించిన...

మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు: రోడ్డు భద్రతపై ..అరైవ్ – అలైవ్.. ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

📰 Generate e-Paper Clip

*మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు: రోడ్డు భద్రతపై ..అరైవ్ – అలైవ్..
ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్*

ప్రజావాణి
ఏప్రిల్ :14
కామారెడ్డి జిల్లా ప్రతినిధి

 

 

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ‘రహదారి భద్రత’ ప్రధాన అంశంగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యాన్ని చేరాలనే లక్ష్యంతో ‘రైవ్ .
అరైవ్ – అలైవ్..రహదారి భద్రత అవగాహన ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమ ముగింపులో కలెక్టర్ మాట్లాడుతూ, సామాజిక బాధ్యతతో పాటు ప్రాణ రక్షణ కూడా ముఖ్యమని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారానే ప్రమాదాలను నివారించగలమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

జాయింట్ కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ.. ఇలాంటి చైతన్య కార్యక్రమాలు సమాజ అభ్యున్నతికి ఎంతో తోడ్పడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమా రాణి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి (డి టి ఓ ) జె. శ్రీనివాస్, అధికారులు మరియు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.