పోలీస్ స్టేషన్‌నే రాజకీయ దాడులకు వేదికగా మార్చడం సిగ్గుచేటు
* పోలీసుల కళ్ల ముందే దాడికి యత్నిస్తే ఇక ప్రజలకు రక్షణ ఎక్కడ
* ముసుగులు ధరించి దాడికి వచ్చిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలి
* ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
జమ్మికుంట సెప్టెంబర్ 14 (ప్రజావాణి)
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ వద్దే దాడికి ప్రయత్నించే పరిస్థితి రావడం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై అనేక అనుమానాలు కలిగిస్తోందన్నారుఅసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసనకు సంబంధించిన ఘటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌లపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. విచారణ పేరుతో వినాయక చవితి పండుగ రోజున వారిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని కౌశిక్ రెడ్డి ఆరోపించారుఇక పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సమయంలో సుమారు 15 మంది మాస్కులు ధరించిన వ్యక్తులు మహేందర్ రెడ్డి మహేష్‌లపై దాడికి ప్రయత్నించడం అత్యంత తీవ్రమైన విషయమన్నారు పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు అడ్డుకోవడంతోనే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారుపోలీస్ స్టేషన్లోకి వచ్చి, పోలీసుల కళ్ల ముందే దాడికి ప్రయత్నించేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందివారికి ఎవరి అండ ఉందిఅని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించిపూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనిడిమాండ్.చేశారురాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోలేక కేసులు పెట్టడం విచారణల పేరుతో వేధించడం చివరకు పోలీస్ స్టేషన్ వద్దే దాడులకు ప్రయత్నించడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారుప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఆ హక్కునుఅణచివేయడంసరికాదన్నారుహోంమంత్రి శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల సమక్షంలో జరిగిన ఈ ఘటనను తేలికగా తీసుకోకుండా మాస్కులు ధరించి వచ్చిన వ్యక్తులను గుర్తించి వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారుచట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ స్టేషన్లోనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితి వస్తే రాష్ట్రంలో సామాన్యుడికి భద్రత ఎక్కడ ఉంటుంది అని ప్రశ్నించారుతెలంగాణలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులను పక్కనపెట్టి ప్రజల భద్రతపై దృష్టి పెట్టాలని, ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు

