📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్సిద్దిపేటలో 110 ఒప్పంద ఉద్యోగాల భర్తీ - ఎన్‌హెచ్‌ఎం పరిధిలో వివిధ కేటగిరీల్లో పోస్టులు...

సిద్దిపేటలో 110 ఒప్పంద ఉద్యోగాల భర్తీ – ఎన్‌హెచ్‌ఎం పరిధిలో వివిధ కేటగిరీల్లో పోస్టులు -సెప్టెంబర్ 15 నుంచి 25 వరకు దరఖాస్తుల స్వీకరణ

📰 Generate e-Paper Clip

సిద్దిపేట,సెప్టెంబర్ 14 (ప్రజావాణి)

జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) పరిధిలో జిల్లాలోని వివిధ ఆరోగ్య కార్యక్రమాలు, ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 110 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కే. హైమావతి తెలిపారు.పల్లె దవఖానాలు, బస్తీ దవఖానాలు, ఎన్‌సీడీ, పాలియేటివ్ కేర్, ఎన్‌యూహెచ్‌ఎం, ఆర్‌బీఎస్‌కే–డీఈఐసీ, మొబైల్ హెల్త్ టీమ్స్, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. వీటిలో స్టాఫ్ నర్స్ 40, ఎంఎల్‌హెచ్‌పీ/సీహెచ్‌ఓ/ఎంఓ 37, ఏఎన్‌ఎం 11, ఫార్మసిస్ట్ 10, ల్యాబ్ టెక్నీషియన్ 4, ఫిజిషియన్ 2తో పాటు ఇతర విభాగాల్లో ఒక్కో పోస్టు చొప్పున ఉన్నాయి.
అర్హతలు, ఇతర పూర్తి వివరాలను సిద్దిపేట జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లోని Recruitment విభాగంలో పరిశీలించాలని అధికారులు సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను సెప్టెంబర్ 15 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దుద్దెడలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (IDOC)లో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.