బద్వేలు జూలై 19 ప్రజావాణి కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బద్వేలు నియోజకవర్గంలో మరో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని గుంతపల్లి బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి,ఉమ్మడి కడప డీసీసీ బ్యాంకు చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి విద్యార్థులకు ప్రభుత్వ సాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం విద్యార్థుల సౌకర్యార్థం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సంక్షేమ కిట్లను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కిట్లలో విద్యార్థులకు నిత్యం ఉపయోగపడే నాణ్యమైన బెడ్‌షీట్లు* కార్పెట్లు*టర్కీ టవళ్లు
నైట్ డ్రెస్సులు ఉన్నాయి.సాధారణ విద్యార్థులకు సైతం మెరుగైన వసతులు కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.కిట్ల పంపిణీ అనంతరం మంచూరు సూర్యనారాయణ రెడ్డి వసతి గృహ విద్యార్థులతో నేరుగా మమేకమయ్యారు.వారి రోజువారీ ఇబ్బందులు,వసతి గృహంలోని సౌకర్యాలు మరియు ఇతర అవసరాల గురించి అత్యంత ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలో తమకు బట్టలు ఉతుక్కునేందుకు తీవ్ర ఇబ్బందిగా ఉందని,ఒక వాషింగ్ మెషిన్ ఉంటే ఎంతో సహాయకరంగా ఉంటుందని విద్యార్థులు ఆయన దృష్టికి తెచ్చారు.విద్యార్థుల విన్నపానికి తక్షణమే స్పందించిన మంచూరు సూర్యనారాయణ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు.ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా,విద్యార్థుల కష్టాన్ని తీర్చేందుకు తన స్వంత ఖర్చులతో త్వరలోనే వసతి గృహానికి వాషింగ్ మెషిన్ అందజేస్తానని అక్కడికక్కడే హామీ ఇచ్చారు.ఆయన తీసుకున్న ఈ తక్షణ నిర్ణయంపై విద్యార్థులు మరియు వసతి గృహ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ,ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సేవా మరియు సంక్షేమ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మాచుపల్లె లక్ష్మీదేవి,వసతి గృహ వార్డెన్,సంబంధిత ప్రభుత్వ అధికారులు,వసతి గృహ సిబ్బంది,స్థానిక ప్రజాప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
గుంతపల్లి బీసీ బాలుర వసతి గృహ విద్యార్థులకు కిట్ల పంపిణీ: సొంత ఖర్చుతో వాషింగ్ మెషిన్ ఇస్తానని మంచూరు సూర్యనారాయణ రెడ్డి హామీ
RELATED ARTICLES




