📄 ePaper
Monday, July 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అప్కోస్ కార్మికులను పర్మనెంట్ చేయాలని 30న కలెక్టరేట్ వద్ద జరుగు ఆందోళన జయప్రదం చేయాలని కరపత్రాలు...

అప్కోస్ కార్మికులను పర్మనెంట్ చేయాలని 30న కలెక్టరేట్ వద్ద జరుగు ఆందోళన జయప్రదం చేయాలని కరపత్రాలు విడుదల.. ‌.‌…సిఐటియు జిల్లా కార్యదర్శి యన్ భైరవప్రసాద్

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల జూలై 19 ప్రజావాణి గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణ నందు కాంటాక్ట్ ఆప్కాస్ ఉద్యోగస్తుల జీతాలు పెంచాలని పర్మిట్ చేయాలని 30వ తేదీన జరగబోయే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని కరపత్రాలు సిఐటియు ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జిల్లాలో ఉన్న అన్ని రంగాల ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని,మినిమం 26వేల వేతనం ఇవ్వాలని,అలాగే అసంఘటిత,సంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జూలై 30వ తేదీన కడప కలెక్టరేట్ వద్ద జరుగు ఆందోళనను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి భైరవ ప్రసాద్ అన్నారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి యన్ భైరవప్రసాద్ మాట్లాడుతూ.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు.ప్రభుత్వ ప్రతి డిపార్ట్మెంట్లో ఆప్కాస్ కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. వారికి తగిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితి మరింత ఘోరమని తెలిపారు. మినిమం 26,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సిఐటి జిల్లా కమిటీ సభ్యులు ప్రకాష్ మండల అధ్యక్షులు సోమయ్య మాట్లాడుతూ.అదే తరుణంలో అసంఘటితరంగ కార్మికులు,ఆటో,హమాలీ,తోపుడు,సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిషాపింగ్ వర్కర్స్ ను ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలని,పెట్రోల్,పని చేసే వర్కర్స్ కు జీతాలు పెంచాలని బ్యాంక్స్ రంగంలో సమస్యలు పరిష్కరించాలని బిల్డింగు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనివారు పాల్గొనాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు అలీ భాష కుసలూరి.రవి,రాజు,ప్రసాద్ సిఐటియు కలసపాడు మండల నాయకులు ప్రసాదు ‌ఇషాక్ పోరుమామిళ్ల గవర్నమెంట్ హాస్పిటల్ శానిటేషన్ వర్కర్స్,ఆప్కాస్ వర్కర్లు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్లు,కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular