📄 ePaper
Monday, July 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి గారికి బద్వేల్ డిపో జేఏసీ కమిటీ వినతి...

పోరుమామిళ్ల పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి గారికి బద్వేల్ డిపో జేఏసీ కమిటీ వినతి పత్రం సమర్పణ

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల జూలై 19 ప్రజావాణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ డి.సి.గోవిందరెడ్డి ని బద్వేల్ డిపో జేఏసీ కమిటీ నాయకులు,ఆర్టీసీ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలు,డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా ఆర్టీసీ పరిరక్షణ,ఉద్యోగుల సంక్షేమం,ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించే అంశాలపై ఎమ్మెల్సీ తో సుదీర్ఘంగా చర్చించారు.ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సులను పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని,వాటి నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా ఆర్టీసీ సిబ్బందితోనే కొనసాగించాలని కోరారు.అదేవిధంగా ఆర్టీసీ సంస్థను మరింత బలోపేతం చేసేలా కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రజలకు నాణ్యమైన రవాణా సేవలు అందించాలని,చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని,విధి నిర్వహణలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా తక్షణమే ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.అలాగే ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు సమస్యలను కూడా వినతి పత్రంలో పొందుపరిచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీ డి.సి.గోవిందరెడ్డి జేఏసీ నాయకులు సమర్పించిన వినతి పత్రాన్ని స్వీకరించి,వారు లేవనెత్తిన సమస్యలను శ్రద్ధగా విన్నారు. అనంతరం మాట్లాడుతూ,మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసన మండలి (కౌన్సిల్ లో) ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను బలంగా ప్రస్తావించి,వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని,ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడంలో ఆర్టీసీ కీలకమైన సంస్థ అని,దానిని బలోపేతం చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు రాజీవ్ భాష,ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకులు బోస్. జనార్ధన్.నాగరాజు.చంద్రయ్య.విజయమ్మ.శ్రీను.శివారెడ్డి మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular