📄 ePaper
Monday, July 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు: అర్థరాత్రి వేళ దోమల కాటు,ఉక్కపోతతో నరకం

మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు: అర్థరాత్రి వేళ దోమల కాటు,ఉక్కపోతతో నరకం

📰 Generate e-Paper Clip

కడప జిల్లా మైదుకూరు జూలై 19 ప్రజావాణి ఆర్టీసీ బస్టాండ్ సమస్యల వలయంగా మారింది.నిత్యం వందలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి.బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉక్కపోత.దోమల బెడద
ప్రస్తుతం ఎండలు,ఉక్కపోత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బస్టాండ్‌లో ఫ్యాన్లు తిరగకపోవడం ప్రయాణికులకు శాపంగా మారింది. ముఖ్యంగా రాత్రి, అర్థరాత్రి సమయాల్లో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు తీవ్రమైన ఉక్కపోతతో పాటు దోమల బెడదతో నరకయాతన అనుభవిస్తున్నారు. చిన్నపిల్లలు,వృద్ధులు,మహిళలు గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షిస్తూ,దోమల కాటుకు గురవుతున్నారు.రాత్రి వేళల్లో బస్టాండ్‌లో కనీసం కూర్చోలేని పరిస్థితి నెలకొందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికుల ఆగ్రహం
ఈ కనీస సౌకర్యాల లేమిపై ప్రయాణికులు,స్థానికులు ఆర్టీసీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఫ్యాన్లు రిపేర్ చేయించాలని,దోమల నివారణ చర్యలు చేపట్టాలని పలుమార్లు సిబ్బందికి, అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.ప్రయాణికుల నుంచి ఛార్జీల రూపంలో భారీగా వసూలు చేస్తున్న ఆర్టీసీ,వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలమైందని మండిపడుతున్నారు.రాత్రి సమయాల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బస్టాండ్‌లోని ఫ్యాన్లను వెంటనే మరమ్మతు చేయించాలని, అలాగే దోమల నివారణకు ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టి ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular