📄 ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
HomeతెలంగాణKamareddyబీర్కూర్‌లో హెల్త్ కేర్ క్యాంప్ ప్రారంభం

బీర్కూర్‌లో హెల్త్ కేర్ క్యాంప్ ప్రారంభం

📰 Generate e-Paper Clip

బీర్కూర్‌లో హెల్త్ కేర్ క్యాంప్ ప్రారంభం

బీర్కూర్: మండల కేంద్రంలోని లోటస్ హెల్త్ కేర్ జనరల్ హాస్పిటల్ అండ్ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ కేర్ క్యాంపును బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అరిగే ధర్మతేజ మాట్లాడుతూ, ఇటువంటి ఆరోగ్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నిర్వహించాలని, ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో లోటస్ హెల్త్ కేర్ జనరల్ హాస్పిటల్ అండ్ డెంటల్ క్లినిక్ ఎండీ డాక్టర్ రానా ప్రతాప్, టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ మహేష్ యాదవ్, మేకల రాములు, మెక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular