📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్రైతుల పంటలకు గిట్టుబాటు ధర, రుణమాఫీ అమలు చేయాలి – పాలడుగు నాగార్జున

రైతుల పంటలకు గిట్టుబాటు ధర, రుణమాఫీ అమలు చేయాలి – పాలడుగు నాగార్జున

📰 Generate e-Paper Clip

నల్లగొండలో లక్ష మందితో రైతు బహిరంగ సభను జయప్రదం చేయాలి

శివన్నగూడెం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఒక్కరు సాగునీరు అందించాలి

రైతుల పంటలకు గిట్టుబాటు ధర, రుణమాఫీ అమలు చేయాలి – పాలడుగు నాగార్జున

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నవంబర్ 15 నుంచి 20 వరకు నల్లగొండ జిల్లా కేంద్రంగా నిర్వహించనున్న అఖిల భారత రైతు సంఘం 36వ మహాసభల సందర్భంగా నల్లగొండలో లక్ష మందితో నిర్వహించే రైతు బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున రైతులకు హాజరయ్యారు. మహాసభల ప్రచార కార్యక్రమంలో భాగంగా మర్రిగూడ మండలం ఇందూర్తి గ్రామంలో రైతులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై దేశవ్యాప్తంగా చర్చించి, భవిష్యత్ పోరాటాలకు కార్యాచరణ రూపొందించేందుకు అఖిల భారత రైతు సంఘం 36వ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. మర్రిగూడ మండల రైతాంగానికి ప్రధానమైన శివన్నగూడెం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి, ప్రతి ఒక్కరు సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం వల్ల రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. రైతులపై భార మోపే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేశారు, రైతులు పండించిన ప్రతి పంటకు స్వామినాథన్ కమీషన్ సిఫారసుల ప్రకారం గిట్టు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మార్కెట్‌లో పంటలకు సరైన ధర లభించక రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వమే కొనుగోలు వ్యవస్థను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నందున, రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని సూచిస్తోంది. గ్రామీణ ప్రాంతాల సరఫరా, పశువులకు నీరు, సాగునీటి వనరుల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అన్నారు. వర్షాభావం, నీటి కొరత కారణంగా అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, తగ్గుదల కారణంగా రైతుల ఆదాయం పడిపోయిందని తెలిపారు. పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి నష్టపరిహారం అందించడంతో పాటు రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించడం, పంటల బీమాను సరిగ్గా అమలు చేయడం, సాగునీటి వనరులను అభివృద్ధి చేయడం, రైతుల ఉత్పత్తులకు మార్కెట్‌ సౌకర్యం కల్పించడం వంటి ప్రభుత్వాలకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీరు, తాగునీరు, గిట్టు, పంట నష్టం, రుణభారం, విద్యుత్, విత్తనాలు, ఎరువులు, మార్కెట్ సమస్యలు తదితర సమస్యలపై పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యలపై తాంగాన్ని ఐక్యం చేసేందుకు అఖిల భారత రైతు సంఘం 36 వ మహాసభల ప్రచార కార్యక్రమాలను గ్రామగ్రామాన విస్తృతంగా నడిపామని తెలిపారు. నవంబర్ 15 నుంచి 20 వరకు నల్లగొండలో మహాసభలు, లక్ష మందితో నిర్వహించే రైతు బహిరంగ సభను రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మండల కమిటీ సభ్యులు రామలింగచారి, మైల సత్తయ్య, , భూతరాజు వెంకటయ్య, కొట్టం యాదయ్య మల్రెడ్డి నరసింహారెడ్డి చేపూరి సుధాకర్, సైదులు, సాయికుమార్, దొడ్డి.పద్మ, మంగమ్మ ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.