📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవరంగల్ విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి

వరంగల్ విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి

📰 Generate e-Paper Clip

వరంగల్ విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి

తెలంగాణ గౌడ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ డిమాండ్

భూపాలపల్లి సెప్టెంబర్ 30 మన ప్రజావాణి: వరంగల్ మామునూరు విమానాశ్రయానికి బహుజన వీరుడు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని తెలంగాణ గౌడ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ పౌరుషాన్ని, పోరాట స్ఫూర్తిని నలుదిశలా చాటిన మహనీయుడని ఆయన పేర్కొన్నారు. కేవలం గౌడ సామాజిక వర్గానికే పరిమితం కాకుండా వివిధ బహుజన వర్గాలను ఏకం చేసి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాట చైతన్యాన్ని కల్పించిన వీరుడిగా పాపన్న గౌడ్ చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు.

గోల్కొండ కోటను స్వాధీనం చేసుకునే స్థాయిలో సైన్యాన్ని నిర్మించి, అప్పటి సామాజిక–రాజకీయ పరిస్థితుల్లో తన ధైర్యసాహసాలను చాటిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు వరంగల్ విమానాశ్రయానికి పేరు పెట్టడం ఆయన సేవలకు తగిన గౌరవమని ప్రభాకర్ గౌడ్ అన్నారు.

వరంగల్ ప్రాంతంతో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు చారిత్రక అనుబంధం ఉందని, కైలాసపూర్ ప్రాంతాన్ని ఆయన జన్మస్థలంగా చరిత్రలో పేర్కొంటున్న నేపథ్యంలో మామునూరు విమానాశ్రయానికి “సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విమానాశ్రయం”గా నామకరణం చేయాలని ఆయన కోరారు.

ఈ నామకరణం ఒక సామాజిక వర్గానికి మాత్రమే సంబంధించిన అంశం కాదని, తెలంగాణ చరిత్రలో పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన ఒక చారిత్రక వీరుడికి ఇచ్చే గౌరవంగా చూడాలని ఆయన అన్నారు.

అన్ని వర్గాల మేధావులు, ప్రజా సంఘాలు, చరిత్రకారులు, ప్రజాప్రతినిధులు ఈ డిమాండ్‌ను పరిశీలించి మద్దతు ఇవ్వాలని ప్రభాకర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.