*ఇందిరమ్మ భీమతో ప్రతి ఒక్కరి జీవితానికి ధీమా*
*లబ్దిదారుల తరపున భీమా కోసం ప్రభుత్వమే నిధులు అందిస్తుంది*
*భీమాను ప్రతి ఒక్కరికి అందేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది*
*మీడియా సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ డా చంద్రశేఖర్*
*ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కర పత్ర విడుదల*
జహీరాబాద్, నవంబర్ 24 (ప్రజావాణి): ఇందిరమ్మ భీమాతో ప్రతి ఒక్కరి జీవితానికి ధీమా అని, 18 సం రాలు నిండిన నాటి నుంచి 59 సం రాలు నిండిన ప్రతి వ్యక్తి ఈ భీమాకు అర్హులు అని, గత ప్రభుత్వం కేవలం రైతులకు మాత్రమే రైతు భీమా ఇవ్వగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 5 లక్షల భీమా అందిస్తుందని ఇంచార్జ్ డా చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నాడు ఉదయం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం గురించి అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని తన కార్యాలయంలో ఏర్పటు చేసిన మీడియా సమావేశంలో ఇంచార్జ్ డా చంద్రశేఖర్ అన్నారు.
ఈ పథకం రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి పేద కుటుంబానికి, ప్రతి ఇంటికీ చేరాలని, అర్హులైన కుటుంబాలెవరూ ఈ పథకం ప్రయోజనాలకు దూరం కాకూడదని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, జహీరాబాద్ మునిసిపల్ ఛైర్మెన్ మొహమ్మద్ యునుస్, పట్టణ అధ్యక్షులు నరేష్ గౌడ్, కోహిర్ పట్టణ అధ్యక్షులు ముజఫ్ఫర్ హుసేన్, తాజా మాజీ మండల పట్టణ అధ్యక్షులు నరేష్ గౌడ్, మండలల అధ్యక్షులు పవన్ రాథోడ్, టి మల్లన్న పాటిల్, కౌన్సిలర్లు వకీల్ చవాన్, మహేష్ మార్క్, సర్పంచులు ప్రేమ్ రాథోడ్, చింతల్ ఘాట్ సర్పంచ్ విద్యాసాగర్, కవేలి సర్పంచ్ సయ్యద్ లాయిక్, జిల్లా ఏఐబిఎస్సెస్ జిల్లా అధ్యక్షులు, నాయకులు పవార్ శ్రీనివాస్ నాయక్, మాజీ అధ్యక్షులు మక్సూద్ ఆహేమద్, నయీమ్ ఆహేమద్, మొహమ్మద్ ఎక్బాల్, మొహమ్మద్ శంషిర్ అలీ, కవేలి కృష్ణ, మజీద్ ఇంజీనియర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

