📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణభవనం నిర్మించాం.. కార్యాలనికి ప్రహరీ గోడా అయినా నిర్మించండి

భవనం నిర్మించాం.. కార్యాలనికి ప్రహరీ గోడా అయినా నిర్మించండి

📰 Generate e-Paper Clip

*భవనం నిర్మించాం.. కార్యాలనికి ప్రహరీ గోడా అయినా నిర్మించండి*

*ప్రభుత్వాలు పార్టీలకు అతితంగా సంక్షేమ కార్యక్రమలు అమలు చెయ్యాలి*

*సహాయ వ్యవసాయ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మాణిక్ రావు*

జహీరాబాద్, నవంబర్ 24 (ప్రజావాణి): బిఆర్ఎస్ ప్రభుత్వం హయంలోనే 60 లక్షలకుపైగా నిధులతో సహాయ వ్యవసాయ సంచాలకుల (ADA) కార్యాలయం భవనాన్ని మంజూరు చేసి పూర్తిస్థాయిలో నిర్మించామని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇది ప్రారంబొత్సవం అవుతున్నందున కనీసం భవనం ప్రహరీ గోడ, కార్యాలయంలో టాయిలెట్లు అయినా నిర్మించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా శాసన సభ పరిధి పట్టణంలోని భవాని మందిర్ రోడ్డుపై నూతనంగా నిర్మితమైన ఏడిఏ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంట్ సభ్యులు సురేష్ షేట్కార్, ఎమ్మెల్యే మాణిక్ రావు తో కలిసి హాజరై రిబ్బన్ కత్తారించి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్పటి బిఅర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు 61.50 లక్షల నిధులతో నూతన ఏడిఏ భవనం మంజూరు చేస్తూ అప్పట్లోనే ప్రొసీడింగ్స్ జారీ చేస్తూ నిర్మాణం పనులు ప్రారంభించినరాని, 2023 చివరన భవనం నిర్మాణం పనులు దాదాపు పూర్తి అయ్యాయని, అప్పుడే ఎన్నికలు జరగడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగిందని, ప్రభుత్వాలు ఏవి ఉన్న ప్రజల సంక్షేమం కోసమే పని చెయ్యాలని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చెయ్యాలని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ లు గుండప్ప, రామకృష్ణ రెడ్డి, మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్, పెంటా రెడ్డి, జహీరాబాద్ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కోహీర్ అధ్యక్షులు నర్సింలు యాదవ్, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు….

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.