📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణతూతూ మంత్రంగా దూలిమిట్ట ప్రథమ సామాజిక తనిఖీ ప్రజా వేదిక

తూతూ మంత్రంగా దూలిమిట్ట ప్రథమ సామాజిక తనిఖీ ప్రజా వేదిక

📰 Generate e-Paper Clip

తూతూ మంత్రంగా దూలిమిట్ట ప్రథమ సామాజిక తనిఖీ ప్రజా వేదిక

11గ్రామాలకు 91వేల 204 రూపాయల జరిమానా

గోప్యంగా గ్రామాల వారిగా జరిమానా జాబితా

బైరాన్ పల్లికి 34 వేల జరిమానా

అడిషనల్ డి ఆర్ డి ఓ శ్రీనివాస్ గౌడ్

మద్దూరు నవంబర్25, ప్రజా వాణి,

దూలిమిట్ట మండలంలోని అన్ని గ్రామాల్లో 1-4 -25నుండి 31-3-26 వరకు ఉపాధి హామీ పనులపై నిర్వహించిన గ్రామస్థాయి సోషల్ అడిట్ అనంతరం బుదవారం దూలిమిట్ట మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రథమ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక ఎంపిడిఓ వీర రాజు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి అడిషనల్ డి ఆర్ డి ఓ ముఖ్య అతిథిగా పాల్గొని అన్ని గ్రామాల ఉపాధి హామీ పనులపై ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శులతో 11గ్రామాలపై సమీక్ష నిర్వహించారు.తనిఖీ బృందం గ్రామాల్లో సేకరించిన సమస్యలను చదివి వినిపిస్తుండగా తూతూ మంత్రంగా గాలికి అధికారులు గాలికి వదిలేశారు. గ్రామాల వారిగా జరిమానా జాబితా ఇవ్వాలని మీడియా ప్రతినిధులు కోరగా ఇవ్వడం కుదరదు అని చెప్పి తీరా చివరికి 91వేల 204 రూపాయలు జరిమానా విధించినట్లు అడిషనల్ డి ఆర్ డి ఓ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇందులో బైరాన్ పల్లిలో జరిగినా ఉపాధి హామీ పనుల్లో ఎక్కువగా సమస్యలు ఉన్నట్లు తేలడంతో 34 వేల జరిమానా విధించినట్లు అడిషనల్ డి ఆర్ డి ఓ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులపై క్షేత్ర స్థాయిలో టి ఏ లు దృష్టి పెట్టీ పనుల వద్దకు వెళ్లి పరిశీలించి పేమెంట్ చేయాలన్నారు. ప్రథమ విడత సామాజిక తనిఖీ కాబట్టి తక్కువ జరిమానాతో వదిలి పెట్టినట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో ఏ పి ఓ స్రవంతి, ఏ వి ఓ గణేష్, జె క్యూ సి సంతోష్ రెడ్డి, ఎస్ ఆర్ పి దేవేందర్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.