📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనైపుణ్య కార్పెంటర్ బిక్షపతి చారి ఇక లేరు.

నైపుణ్య కార్పెంటర్ బిక్షపతి చారి ఇక లేరు.

📰 Generate e-Paper Clip

నైపుణ్య కార్పెంటర్ బిక్షపతి చారి ఇక లేరు..
ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన వడ్రంగ వృత్తిలో సీనియర్ నైపుణ్య కళాకారుడు పోలోజు బిక్షపతి చారి(86) ఇక లేరు.వృద్ధాప్య సమస్యలతో మంగళవారం ఆయన తన స్వగృహంలో కన్నుమూశారు. కార్పెంటర్ వృత్తికి వన్నెతెచ్చిన విశేష స్కిల్ కలిగిన బిక్షపతి చారి పరమపదించడంతో గ్రామస్తులు శోకసముద్రంలో మునిగిపోయారు. వడ్రంగి వృత్తిలో ఎటువంటి డిజైన్ ఐనా అలవోకగా తయారుచేసి అందజేసే అసాధారణ వృత్తి ప్రతిభా నైపుణ్యం కలిగిన బిక్షపతి చారి దివి నుంచి భువికేగడంతో ఆయన ద్వారా వ్యవసాయ, గృహోపకరణ వస్తువులు రూపొందించుకున్న వారంతా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.బిక్షపతి చారి ఇంటింటికి ఏదో ఒక వస్తువు తన తమ చెక్కపని నైపుణ్యంతో చేయని ఇల్లే లేదంటే అతిశయోక్తి కాదు.కర్ర పనిలో ఆయనకు ఆయనే సాటి అని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు.పెద్ద ఎత్తున బిక్షపతి చారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాగా బిక్షపతి చారికి భార్య యశోద ముగ్గురు కుమారులు సోమేశ్వర చారి(బాబు) దేవేంద్ర చారి, శ్రీనివాసాచారి, ఓ కూతురు శోభ ఉన్నారు. మహాప్రస్థాన యాత్ర బుధవారం నిర్వహించగా గ్రామస్తులు బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.