📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణప్రజలకు మెరుగైన వైద్యసేవలే ప్రభుత్వ లక్ష్యం.

ప్రజలకు మెరుగైన వైద్యసేవలే ప్రభుత్వ లక్ష్యం.

📰 Generate e-Paper Clip

ప్రజలకు మెరుగైన వైద్యసేవలే ప్రభుత్వ లక్ష్యం.

(వైద్య అధికారులు అంకిత భావంతో పనిచేయాలి..
జుక్క ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు.)

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 25

జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య శాఖను మరింత బలపేతం చేయాలని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. ఈ మేరకు మంగళవారం నియోజకవర్గ వైద్య అధికారులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. నూతనంగా నియమితులైన వైద్య అధికారులకు శుభాకాంక్షలు తెలిపి, విధుల్లో చేరెందుకు ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ప్రభుత్వ ఆసుపత్రిలకు వచ్చే ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించాలని, అంకితభావంతో పనిచేస్తూ, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు.. వైద్య అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.. వైద్య అధికారుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.. ఈ సమావేశంలో డిసిహెచ్ ఎస్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఆనంద్ జాదవ్, కాళిదాస్, తో పాటు పలువురు వైద్య అధికారులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.