ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ సిహెచ్ రాజశేఖర్ రెడ్డి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 21 (ప్రజావాణి):జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ సిహెచ్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా, మున్సిపల్ మేనేజర్ పి. ప్రభాకర్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సిహెచ్ రాజశేఖర్ రెడ్డి మరియు కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో జీవిత బీమా ఎంతో కీలకమని తెలిపారు. అనుకోని ప్రమాదాలు లేదా కుటుంబ పెద్ద అకాల మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ఈ ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం ఒక రక్షణ కవచంలా నిలుస్తుందని వివరించారు.
బీమాతో కుటుంబానికి రక్షణ లభిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాలకు భరోసా కల్పించుకోవాలని వారు పిలుపునిచ్చారు. వార్డులోని అర్హులందరికీ ఈ పథకం అందేలా రాజకీయాలకు అతీతంగా అందరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గోపి, కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు గుంటుక దామోదర్ రెడ్డి, సీనియర్ నాయకులు మార్తల ప్రభాకర్, గొట్టం శ్రీధర్ రెడ్డి, సిపిఎం శాఖ సెక్రెటరీ గుండు శశిరేఖ, బిఆర్ఎస్ నాయకులు కాంటూరి అంజాజి, బిజెపి నాయకులు కే బాలసుబ్రమణ్యం (శివ), వార్డు ప్రముఖులు భోగ భాస్కర్, బత్తిని నరసింహులు, ఆలూరి రమేష్ సిరివెళ్లి, ఓగలబోయిన బాల కనకయ్య, కర్రె రాములు, ఉలిగిల్ల చంద్రయ్య, తోకల మార్తా, ఉలిగిల్లా స్వరూప, రాంప్రసాద్, మేకల గణేష్, బిట్ల రవి, గర్దాస్ చంద్రయ్య, వార్డ్ ఆఫీసర్లు నిఖిల్ రెడ్డి, తిప్పారపు యాకుబ్, ఆర్ పి దుంబాల రేవతి, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

