📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణజిల్లా పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థులు

జిల్లా పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థులు

📰 Generate e-Paper Clip

జిల్లా పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థులు
ఎల్టా,చెకుముకి పోటీల్లోనెల్లికుదురు విద్యార్థుల ప్రతిభ..
ప్రజావాణి నెల్లికుదురు :మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల విద్యార్థులు శనివారం నిర్వహించిన మండల స్థాయి ఎల్టా ఇంగ్లీష్ ప్రతిభా పోటీలు, చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో విశేష ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ( ఎల్టా )ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మండల స్థాయి ఇంగ్లీష్ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.ఇంగ్లీష్ ఒలంపియాడ్ సీనియర్ విభాగంలో ఎస్. దీక్షిత్, జూనియర్ విభాగంలో పి. అయాన్ జూనియర్ విభాగంలో పి. సిరివెన్నెల విజేతలుగా నిలిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో ప్రథమ స్థానం

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం నెల్లికుదురు ఎంపీపీఎస్ పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో మోడల్ స్కూల్ విద్యార్థులు జి. ప్రణీత, జి. అమృతవర్షిణి, పి. అయాన్ బృందం ప్రథమ స్థానాన్ని సాధించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది.

విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ జి. ఉపేందర్ రావు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలు, శాస్త్రీయ దృక్పథం, తార్కిక ఆలోచనా సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
ఒకే రోజు రెండు వేర్వేరు ప్రతిభా పోటీల్లో పాఠశాల విద్యార్థులు విజయాలు సాధించి జిల్లా స్థాయికి ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జిల్లా స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.