📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఆంగ్ల భాషపై పట్టు సాధిస్తే ఉజ్వల భవిష్యత్తు.

ఆంగ్ల భాషపై పట్టు సాధిస్తే ఉజ్వల భవిష్యత్తు.

📰 Generate e-Paper Clip

ఆంగ్ల భాషపై పట్టు సాధిస్తే ఉజ్వల భవిష్యత్తు.

దండేపల్లి, నవంబర్ 21 ( ప్రజావాణి ): ఆంగ్ల భాషపై ఎలాంటి భయాందోళనలు లేకుండా పట్టు సాధిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మండల విద్యాధికారి మంత్రి రాజు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శోభ పేర్కొన్నారు. ఆంగ్ల భాషపై విద్యార్థులు ఆసక్తి పెంపొందించుకొని, ఆత్మవిశ్వాసంతో మాట్లాడే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు.ఆంగ్ల భాష ఉపాధ్యాయుల సంఘం (ఎల్టా) ఆధ్వర్యంలో శనివారం మండల స్థాయిలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఒలింపియాడ్, ఎడ్యుటాక్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ముఖ్య అతిథులుగా హాజరైన మండల విద్యాధికారి మంత్రి రాజు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శోభ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు వివిధ పోటీల్లో పాల్గొనడం ద్వారా తమలోని ప్రతిభను వెలికితీయవచ్చన్నారు. పోటీల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, ఓడిపోయిన విద్యార్థులు నిరుత్సాహపడకుండా మరింత పట్టుదలతో కృషి చేసి భవిష్యత్తులో విజయం సాధించాలని సూచించారు. ఆంగ్ల భాషపై పట్టు సాధించడం ద్వారా ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు.అనంతరం నిర్వహించిన ఒలింపియాడ్ పోటీల్లో సీనియర్ విభాగంలో ద్వారక ఉన్నత పాఠశాలకు చెందిన రఘువర్ధన్ ప్రథమ స్థానం సాధించగా, జూనియర్ విభాగంలో వెలగనూరు పాఠశాలకు చెందిన రాజవీర్ సూర్య ప్రథమ స్థానంలో నిలిచారు. అదేవిధంగా ఎడ్యుటాక్ పోటీల్లో గుడిరేవుకు చెందిన అహల్య, అర్చన సీనియర్, జూనియర్ విభాగాల్లో ప్రథమ స్థానాలు కైవసం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు అప్పాల మనోహర్, ఎల్టా మండల కన్వీనర్ ముత్తే వెంకటమల్లు, ఆంగ్ల ఉపాధ్యాయులు శ్రీనివాస్, రూపాచారి, ఉమ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.