📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణలక్ష్మీదేవిపేట ఏడుస్తుంది.. 30 ఏళ్లు నిండకుండానే విగతజీవులు

లక్ష్మీదేవిపేట ఏడుస్తుంది.. 30 ఏళ్లు నిండకుండానే విగతజీవులు

📰 Generate e-Paper Clip

లక్ష్మీదేవిపేట ఏడుస్తుంది.. 30 ఏళ్లు నిండకుండానే విగతజీవులు

లక్ష్మీదేవిపేటలో ఏం జరుగుతుంది?

కళ్ళముందే వెళ్లిపోతున్న స్నేహితులు

చెప్పకుండా వెళ్లిపోతున్న నడి వయసు వాళ్ళు

ములుగు జిల్లా ప్రతినిధి ప్రజావాణి సేకరణ

ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం, లక్ష్మీదేవిపేట.

ఈ ఊరి పేరు చెప్తే ఒకప్పుడు పచ్చదనం గుర్తొచ్చేది. ఇప్పుడు ఆ ఊరి పేరు చెప్తే గుండె బరువెక్కుతుంది.
ఎందుకంటే ఈ ఊర్లో ఇప్పుడు చావు వయసు చూడటం లేదు.
30 ఏళ్లు నిండకుండానే యువకులు వెళ్లిపోతున్నారు. నిన్నటి దాకా కలిసి తిరిగిన స్నేహితుడు, కలిసి టీ తాగిన స్నేహితుడు, కలిసి నవ్విన స్నేహితుడు కళ్ళముందే ఏడిపించి వెళ్లిపోతున్నాడు.
నడి ఈడు వయసు వాళ్ళు, కుటుంబానికి అండగా ఉండాల్సిన వాళ్ళు, పిల్లలకు తండ్రిగా, తల్లికి కొడుకుగా, భార్యకు భర్తగా ఉండాల్సిన వాళ్ళు చెప్పకుండా, ఏ మాటా చెప్పకుండా వెళ్లిపోతున్నారు.
ఒక ఇంట్లో ఏడుపు ఆగకముందే, మరో ఇంట్లో ఏడుపు మొదలవుతుంది.
తల్లి కొడుకు కోసం ఏడుస్తుంది. భార్య భర్త కోసం ఏడుస్తుంది. పిల్లలు నాన్నా అని పిలిచి ఏడుస్తున్నారు. స్నేహితులు… మాట్లాడేందుకు మాటలు లేక మౌనంగా ఏడుస్తున్నారు.

*అసలు లక్ష్మీదేవిపేటలో ఏం జరుగుతుంది?*

ఇది ఒక్క కుటుంబం బాధ కాదు ఇది ఊరి బాధ.
ఇది ఒక్క స్నేహితుడి బాధ కాదు. ఇది తరం బాధ.
ఈ చావుల వెనక కారణం ఏంటి? ఆరోగ్య సమస్యా? నిర్లక్ష్యమా? తెలియని భయమా? ఎవరైనా చెప్పాలి. ఎవరైనా పట్టించుకోవాలి.
ఊరు ఊరంతా ఒక్కటై అడుగుతున్న ప్రశ్న ఇదే.
మా యువకులు ఎందుకు పోతున్నారు? మా నడి వయసు వాళ్ళు ఎందుకు రాలిపోతున్నారు?
ఇప్పటికైనా అధికారులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు లక్ష్మీదేవిపేట వైపు చూడాలి. ఊర్లో హెల్త్ క్యాంప్ పెట్టాలి. ప్రతి ఒక్కరిని పరీక్షించాలి. కారణం తెలుసుకోవాలి. మరో ప్రాణం పోకుండా ఆపాలి.
లేకపోతే రేపు మరో తల్లి ఏడుస్తుంది. మరో భార్య తాళి తీస్తుంది. మరో బిడ్డ నాన్నా అని ఏడుస్తుంది.

లక్ష్మీదేవిపేట ఏడవకూడదు లక్ష్మీదేవిపేట బతకాలి.

అనుభవంతో గత నెల నుండి చూస్తున్న
మీ ప్రజావాణి రిపోర్టర్‌ గొల్లపెల్లి శ్రీకాంత్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.