ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి
ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ సిహెచ్ రాజశేఖర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 21 (ప్రజావాణి):జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ సిహెచ్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా, మున్సిపల్ మేనేజర్ పి. ప్రభాకర్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సిహెచ్ రాజశేఖర్ రెడ్డి...