బాధిత కుటుంబానికి రెడ్ క్రాస్ సొసైటీ జుక్కల్ శాఖ చేయూత…
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 21
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గీ తాండలో ఇటీవల ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరగడంతో ఈ విషయం తెలుసుకొని ఆ కుటుంబానికి రెడ్ క్రాస్ సొసైటీ జుక్కల్ శాఖ ఆధ్వర్యంలో వంట పాత్రలు, నిత్యవసర వస్తువులు, 30 కేజీల జొన్నలు, బాధిత కుటుంబానికి జుక్కల్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు ఉమాకాంత్ పటేల్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది… ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు దస్థిరం జ మాట్లాడుతూ….. సర్వం కోల్పోయిన నా కుటుంబానికి తన వంతు సహకారాన్ని అందించామని ఆయన అన్నారు.. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు విక్రమ్, ఆనంద్ కుమార్, గంగాధర్,షేరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

