📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonదొరల దౌర్జన్యాన్ని ఎదిరించిన పోరాట యోధుడు నల్ల నర్సింహులు

దొరల దౌర్జన్యాన్ని ఎదిరించిన పోరాట యోధుడు నల్ల నర్సింహులు

📰 Generate e-Paper Clip

*దొరల దౌర్జన్యాన్ని ఎదిరించిన పోరాట యోధుడు నల్ల నర్సింహులు*

*శత జయంతి ఉత్సవాలకు సుందర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్‌కు ఆహ్వానం*

*అక్టోబర్ 2న జనగామ బతుకమ్మ కుంట ఆవరణలో ఘనంగా ఉత్సవాలు*

*జనగామ, సెప్టెంబర్ 29 (ప్రజావాణి న్యూస్):
దొరలు, భూస్వాముల పెత్తందారీ దోపిడీకి వ్యతిరేకంగా పేదలు, రైతుల పక్షాన నిలిచి పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విప్లవ యోధుడు నల్ల నర్సింహులు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అక్టోబర్ 2వ తేదీన జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట ఆవరణలో శత జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగాడి జిల్లా లోని దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన సుందర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్ ని ఉత్సవాలకు హాజరై విజయవంతం చేయాలని కోరుతూ నిర్వాహకులు ఆహ్వానించారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నల్ల నర్సింహులు ప్రదర్శించిన తెగువ, ధైర్యసాహసాలు, ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటం, పేదలు-రైతుల పక్షాన నిలిచిన పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా స్మరించుకోనున్నారు. భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచి, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన నల్ల నర్సింహులు త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నిర్వాహకులు పేర్కొన్నారు.

శత జయంతి ఉత్సవాలకు ప్రజలు, యువత, రైతులు అధిక సంఖ్యలో హాజరై నల్ల నర్సింహులు ఆశయాలను స్మరించుకోవాలని వారు పిలుపునిచ్చారు.

ఆహ్వానం పలికిన వారిలో నల్ల నరసింహులు శత జయంతి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ చింతకింది అరుణ, వైస్ చైర్మన్ & పాలకుర్తి మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు మాచర్ల సారయ్య, బమ్మెర మాజీ ఎంపీటీసీ దేవసాని కృపాకర్, మాన్యపు భుజేందర్ కవి, ఏల యాదగిరి నేత తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.