📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్మేడ్చల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

మేడ్చల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

📰 Generate e-Paper Clip

మేడ్చల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నిరసన

మేడ్చల్: హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపిస్తూ మేడ్చల్ పట్టణంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మేడ్చల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షురాలు శైలజ హరినాథ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దేవుళ్లపై వ్యాఖ్యలు చేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. ‘‘శివుడు గరీబోళ్ల దేవుడు, రాముడు గొప్పోళ్ల దేవుడు’’ అంటూ దేవుళ్ల మధ్య పేద, ధనిక అనే తేడాలను చూపించడం సరికాదన్నారు. శ్రీరాముడు సకల లోకాలకు ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పి. ప్రభాకర్ రెడ్డి, జిల్లా కోశాధికారి ఎల్‌వీ శ్రీకాంత్, జిల్లా సీనియర్ నాయకులు రామన్నగారి శ్రీనివాస్ గౌడ్, పి. సుధాకర్ రెడ్డి, మేడ్చల్ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగం అర్జున్, ప్రధాన కార్యదర్శి ప్రేమ్ దాస్, ఉపాధ్యక్షులు మైసరి రాజు, సీహెచ్. శ్రీనివాస్ గౌడ్, మహిళా మోర్చా జిల్లా అధికార ప్రతినిధి బచ్చు కృష్ణప్రియ రెడ్డి, నాయకులు దాత్రిక లక్ష్మణ్, సీహెచ్. సత్యనారాయణ, మోహన్ రావు, జాకట బాబు రాజు, వెంకటేష్ చారి, బీజేవైఎం నాయకులు గౌలికర్ మహేష్, కేశవరెడ్డి, భరత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.