📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమంచాల గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీ ఎన్నిక

మంచాల గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీ ఎన్నిక

📰 Generate e-Paper Clip

*మంచాల గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీ ఎన్నిక*

ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడమ నరేందర్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా మంచాల సెప్టెంబర్ 29 (ప్రజావాణి)*

*గ్రామ శాఖ అధ్యక్షుడిగా నీళ్ల కృష్ణను ఎన్నుకోవడం జరిగింది**

నూతన కమిటీని సన్మానించిన సర్పంచ్ మానస వినయ్, ఉపసర్పంచ్ లింగం

మంచాల: గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు రావుల శ్రీనివాస్ అధ్యక్షతన మంచాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడమ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంచాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా నీళ్ల కృష్ణ, ఉపాధ్యక్షులుగా పులకంటి భాస్కర్ రెడ్డి, ఎం.డి. హుస్సేన్, ప్రధాన కార్యదర్శులుగా గడ్డం బాబయ్య, ఎరుకొండ రాములు, కార్యదర్శులుగా ఏర్పుల నరసింహ, ఆవ రమేష్, బొల్లాపల్లి కిషన్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా మొగిలి మహేష్, ఏర్పుల అశోక్, దూసరి కుమార్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా రావుల మల్లయ్యను ఎన్నుకున్నారు.

కార్యవర్గ సభ్యులుగా గడ్డం మల్లేష్, దండేటికర్ ధనరాజ్, పులకంటి శ్రీనివాస్ రెడ్డి, పుడుత దేవేందర్, ఎలామోని యాదయ్యలను ఎంపిక చేశారు. బీసీ సెల్ అధ్యక్షుడిగా కాళ్ల మల్లేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గడ్డం మహేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గడ్డం శ్రీకాంత్‌ను ఎన్నుకున్నారు.

నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను సర్పంచ్ మానస వినయ్, ఉపసర్పంచ్ లింగం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు.

కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్యార జంగయ్య, పుడుత సాయిలు, పార్టీ సీనియర్ నాయకులు ప్రేమకర్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.