వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం.. వృద్ధులకు పండ్లు, నిత్యావసర వస్తువుల పంపిణ
జవహర్‌నగర్: సెప్టెంబర్ 29 ( ప్రజావాణి ప్రతినిధి)
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 25 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ నెల రోజుల సేవా కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ జిల్లా ఆధ్వర్యంలో దేవేందర్ కాలనీ,విజన్ ఇండ్ వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు పండ్లు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ బుద్ధి శ్రీనివాస్ గారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడ్చల్ నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ మాజీ ఎంపీపీ శ్రీ ఏనుగు సుదర్శన్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ వేణుగోపాల్ , OBC మోర్చా జిల్లా అధ్యక్షులు మహేందర్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులతో నాయకులు ఆత్మీయంగా మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు. సమాజంలోని వృద్ధులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సంతోష్ గుప్తా, మరాఠీ బాబు, OBC మోర్చా నాయకులు వేణుగోపాల్, భిక్షపతి, కిషోర్ గౌడ్, గక్కల రాము, బాలరాజ్ గౌడ్, యాదగిరి, భీమారాణి, లిఖిత యాదవ్, లక్ష్మీ రెడ్డి, ముచ్చర్ల యాదగిరి, మహేష్ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

