*ఘనంగా ముదిరాజ్ సంఘం వినాయకుడి నిమజ్జన మహోత్సవం*
*భక్తిశ్రద్ధలతో గణనాథుడి నిమజ్జనం.. రూ.11,116లకు లడ్డూ ప్రసాదం వేలం*
మేడ్చల్, ప్రజావాణి మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ డివిజన్ పూడూరు గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన మహోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పాలకుర్తి శివ ప్రసాద్ పంతులు ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. గ్రామస్తులు, ముదిరాజ్ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వినాయకుడి లడ్డూ ప్రసాదానికి వేలం పాట నిర్వహించగా మేకల కృష్ణ–కృష్ణవేణి దంపతులు రూ.11,116లకు లడ్డూను కైవసం చేసుకున్నారు. అనంతరం వినాయకుడి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయ ప్రాంగణంలోని మంజీరా నది వద్దకు తరలించారు. భక్తుల జయజయధ్వానాలు, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య గణనాథుడిని నదిలో నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమంలో గ్రామస్తులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
*ఏడుపాయల వనదుర్గ భవాని మాతకు ప్రత్యేక పూజలు*
నిమజ్జన కార్యక్రమం అనంతరం గ్రామస్తులు ఏడుపాయల వనదుర్గ భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. కుటుంబాల్లో సుఖశాంతులు నెలకొనాలని, గ్రామం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అలాగే రైతులకు అనుకూలంగా వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు బాగా పండాలని, పంటలకు అధిక దిగుబడులు రావాలని గ్రామస్తులు అమ్మవారిని ప్రార్థించారు. గ్రామ ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నారు.
*ఘనంగా ముగిసిన నిమజ్జన వేడుకలు*
ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో ముగిసింది. ఉత్సవం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యువజన సంఘం ఉపాధ్యక్షులు జీ. పరమేశ్, నీరుడి శ్రీరామ్, మాజీ ఎంపీటీసీ నీరుడి రఘు, సంఘం నాయకులు మర్రిచెట్టు ప్రసాద్, కొండ శ్రీనివాస్, బలబోయిన శివ, గుడిసె నర్సింహా, మర్రిచెట్టు శ్రీనివాస్, కుంట రవి, తిరుమణి రమేష్, వెంకట్, లచ్చు నర్సింహా, మేకల కృష్ణ, సాడే రాజు, అర్జున్, పుట్నాల శోభన్, నీరుడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

