*ఘనంగా ముదిరాజ్ సంఘం వినాయకుడి నిమజ్జన మహోత్సవం*

*ఘనంగా ముదిరాజ్ సంఘం వినాయకుడి నిమజ్జన మహోత్సవం* *భక్తిశ్రద్ధలతో గణనాథుడి నిమజ్జనం.. రూ.11,116లకు లడ్డూ ప్రసాదం వేలం* మేడ్చల్, ప్రజావాణి మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ డివిజన్ పూడూరు గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన మహోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పాలకుర్తి శివ ప్రసాద్ పంతులు ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. గ్రామస్తులు, ముదిరాజ్ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో...