📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకాగజ్‌నగర్ మండల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్

కాగజ్‌నగర్ మండల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్

📰 Generate e-Paper Clip

కాగజ్‌నగర్ మండల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్

కొమ్మురం బీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టం లో మండల అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించిన మండల సమీక్ష సమావేశానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కామ్డే అనిల్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులు, సర్పంచులతో కలిసి సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా గ్రామాల వారీగా అభివృద్ధి పనుల పురోగతిని ఎమ్మెల్సీ దండే విఠల్ అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రామాల్లో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను సర్పంచులు ఎమ్మెల్సీ దండే విఠల్ గారి దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్సీ దండే విఠల్ కోరారు.
ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, మండల స్థాయి సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.