📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగణనాధునికి ఐదవ రోజు ప్రత్యేక పూజ

గణనాధునికి ఐదవ రోజు ప్రత్యేక పూజ

📰 Generate e-Paper Clip

గణనాధునికి ఐదవ రోజు ప్రత్యేక పూజ

చిలిపిచెడ్ .సెప్టెంబర్ 18 ప్రజావాణి

చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రతేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని పాడి పంటలు, అష్ట ఐశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
హనుమాన్ భజన మండలి సభ్యులు గ్రామ పెద్దలను శాలువాతో సత్కరించారు.
*ఐదవ రోజు విశిష్టతలక్ష్మీ గణపతి రూపం*
సాధారణంగా నవరాత్రులలో ఐదవ రోజున విఘ్నేశ్వరుడిని లక్ష్మీ గణపతి లేదా హేరంబ గణపతి రూపంలో అర్చిస్తారు. ఈ రూపం ఐశ్వర్యాన్ని, విజయాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు.

*పంచమి తిథి ప్రాముఖ్యత*

ఐదవ రోజు పంచమి తిథితో కూడి ఉండటం వల్ల, ఈ రోజున చేసే పూజల వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి, సుఖశాంతులు కలుగుతాయి.

*బుద్ధి, జ్ఞాన వికాసం*
విద్యార్థులు ఈ రోజున గణపతిని పూజిస్తే చదువులో ఏకాగ్రత, జ్ఞానం పెరుగుతాయి.పూజా విధానం & *నైవేద్యంఅలంకరణ*

లక్ష్మీ గణపతి రూపానికి పసుపు, కుంకుమలు మరియు ఎర్రటి పూలతో (ముఖ్యంగా మందార పూలు) అలంకారం చేస్తారు.

*పత్ర పూజ*

ఈ రోజు పూజలో రేగు ఆకు (బదరీ పత్రం) లేదా గరిక ఉపయోగించడం చాలా శ్రేష్ఠం.

*ప్రత్యేక నైవేద్యం*

ఐదవ రోజు వినాయకునికి కుడుములు (లేదా మోదకాలు), పులిహోర, మరియు చలిమిడి, వడపప్పులను నైవేద్యంగా సమర్పిస్తారు అని పూజారి తెలియజేశారు.

కార్యక్రమంలో హనుమాన్ భజన మండలి సభ్యులను గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.